IND vs ENG: భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‍లో అరంగేట్రం చేసిన ఆరుగురు ఆటగాళ్లు వీరే
India vs England Test Series: భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‍లో నాలుగు టెస్టులు ముగిశాయి. 3-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్ దక్కించుకుంది. కాగా, ఈ సిరీస్‍లో ఇరు జట్ల తరఫున ఆరుగురు ఆటగాళ్లు టెస్టు క్రికెట్‍లో అరంగేట్రం చేశారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
(1 / 6)
భారత యంగ్ వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్.. ఇంగ్లండ్‍తో రాజ్‍కోట్‍లో జరిగిన మూడో టెస్టుతో టెస్టు క్రికెట్‍లో అరంగేట్రం చేశాడు. రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 39 రన్స్ (నాటౌట్) చేసి భారత్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. (ANI)
(2 / 6)
విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో బ్యాటర్ రజత్ పాటిదార్.. టీమిండియా టెస్టు జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 63 రన్స్ చేశాడు. ఇందులో రెండు డకౌట్లు ఉన్నాయి. (AFP)
(3 / 6)
రాంచీలో జరిగిన మూడో టెస్టులో భారత యువ పేసర్ అకాశ్ దీప్ టెస్టు జట్టులో డెబ్యూట్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లోనే మూడు వికెట్లతో దుమ్మురేపాడు. (ANI)
(4 / 6)
రాజ్‍కోట్‍లో జరిగిన మూడో టెస్టుతో భారత బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ టెస్టు జట్టులోకి వచ్చాడు. తొలి మ్యాచ్‍లోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో అర్ధ శతకాలతో రాణించాడు. (PTI)
(5 / 6)
భారత్‍తో హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టుతో అరంగేట్రం చేశాడు ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హార్ట్లీ. ఇప్పటి వరకు నాలుగు టెస్టుల్లో 20 వికెట్లు పడగొట్టాడు. 159 రన్స్ కూడా చేశాడు. (PTI)
ఇతర గ్యాలరీలు