IND vs BAN: సింగిల్ హ్యాండ్‍తో రోహిత్ అదిరే క్యాచ్.. అవాక్కయిన బంగ్లా బ్యాటర్.. సిరాజ్ కూడా సూపర్ క్యాచ్: వీడియోలు-rohit sharma and mohammed siraj takes super catches watch videos india vs bangladesh 2nd test kanpur ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Ban: సింగిల్ హ్యాండ్‍తో రోహిత్ అదిరే క్యాచ్.. అవాక్కయిన బంగ్లా బ్యాటర్.. సిరాజ్ కూడా సూపర్ క్యాచ్: వీడియోలు

IND vs BAN: సింగిల్ హ్యాండ్‍తో రోహిత్ అదిరే క్యాచ్.. అవాక్కయిన బంగ్లా బ్యాటర్.. సిరాజ్ కూడా సూపర్ క్యాచ్: వీడియోలు

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 30, 2024 12:14 PM IST

IND vs BAN Rohit Sharma Catch: బంగ్లాదేశ్‍తో రెండో టెస్టులో రోహిత్ శర్మ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. వేగంగా గాల్లో వెళుతున్న బంతిని ఒంటి చేత్తో అందుకున్నాడు. దీంతో బంగ్లా ప్లేయర్ లిటన్ దాస్ షాక్ అయ్యాడు. సిరాజ్ కూడా ఓ అదిరే క్యాచ్ తీసుకున్నాడు.

IND vs BAN: సింగిల్ హ్యాండ్‍తో రోహిత్ అదిరే క్యాచ్.. అవాక్కయిన బంగ్లా బ్యాటర్.. సిరాజ్ కూడా సూపర్ క్యాచ్: వీడియోలు
IND vs BAN: సింగిల్ హ్యాండ్‍తో రోహిత్ అదిరే క్యాచ్.. అవాక్కయిన బంగ్లా బ్యాటర్.. సిరాజ్ కూడా సూపర్ క్యాచ్: వీడియోలు

భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు నాలుగు రోజు ఆట ఎట్టకేలకు సాధ్యమైంది. ఈ మ్యాచ్ రెండు, మూడు రోజులు ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యాయి. కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ రెండో టెస్టు తొలి రోజు 35 ఓవర్లు ఆడిన బంగ్లాదేశ్.. నేడు (సెప్టెంబర్ 30) నాలుగో రోజు ఆటలో బ్యాటింగ్ కొనసాగించింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. గాల్లోకి ఎగిరి సింగిల్ హ్యాండ్‍తో బాల్‍ను పట్టుకున్నాడు.

రోహిత్ సూపర్ క్యాచ్

బంగ్లాదేశ్ బ్యాటర్ లిటన్ దాస్ క్యాచ్‍ను టీమిండియా సారథి రోహిత్ శర్మ అద్భుతంగా అందుకున్నాడు. 50వ భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ వేశాడు. ఆ ఓవర్ మూడో బంతికి మిడ్‍ఆఫ్ వైపుగా గాల్లోకి బలంగా షాట్ కొట్టాడు లిటన్. బలంగా బాదడంతో ఆ బంతి బౌండరీ వెళుతుందని అనిపించింది. అయితే, మిడాఫ్‍లో ఫీల్డింగ్ చేస్తున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ గాల్లోకి ఎగిరి.. ఒంటి చేత్తో క్యాచ్ పట్టేశాడు.

అంత బలమైన షాట్ కొట్టినా రోహిత్ శర్మ కళ్లు చెదిరే క్యాచ్ పట్టడంతో లిటన్ దాస్ షాక్ అయ్యాడు. అవాక్కయినట్టు చూస్తూ నిరాశగా పెవిలియన్ వైపుగా నడుచుకుంటూ వెళ్లాడు. రోహిత్ సూపర్ క్యాచ్ పట్టడంతో భారత స్టార్ విరాట్ కోహ్లీ కూడా సెలెబ్రేట్ చేసుకున్నాడు. సూపర్ రియాక్షన్ ఇచ్చాడు.

రోహిత్ శర్మ పట్టిన ఈ క్యాచ్ వీడియోను జియోసినిమా ఓటీటీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. వన్ హ్యాండ్.. ఆల్ క్లాస్ అంటూ ఈ వీడియో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. రోహిత్ శర్మను నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

సిరాజ్ కూడా మంచి క్యాచ్

భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ కూడా ఓ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. 56వ ఓవర్లో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‍లో బంగ్లా బ్యాటర్ షకీబల్ హసన్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి గాల్లోకి చాలా పైకి లేచింది. మిడాఫ్‍లో ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్.. వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి క్యాచ్ తీసుకున్నాడు. కష్టమైన క్యాచ్‍ను అలవోకగా పట్టి వారెవా అనిపించుకున్నాడు. మొత్తంగా రోహిత్, సిరాజ్ అదిరే క్యాచ్‍లు పట్టారు.

మోమినుల్ సెంచరీ

ఓ వైపు వికెట్లు పడుతున్నా బంగ్లాదేశ్ బ్యాటర్ మోమినుల్ హక్ అద్భుత శతకం చేశాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటున్నాడు. 172 బంతుల్లో సెంచరీ చేరుకున్నాడు మోమినుల్. నిలకడగా ఆడుతూ పరుగులు రాబడుతున్నాడు. నేడు నాలుగో రోజు ఆటను 3 వికెట్లకు 107 పరుగుల వద్ద కొనసాగించింది బంగ్లాదేశ్. మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీం క్రీజులోకి వచ్చారు. రహీం(11)ను త్వరగానే భారత పేసర్ బుమ్రా పెవిలియన్‍కు పంపించాడు.

లిటన్ దాస్ (11)ను సిరాజ్, షకీబల్ హసన్‍ను అశ్విన్ (9) ఔట్ చేశారు. దీంతో తొలి సెషన్‍లో మూడు వికెట్లు కోల్పోయింది బంగ్లా. లంచ్ సమయానికి 6 వికెట్లకు 205 పరుగులు చేసింది. క్రీజులో మోమినుల్ హక్ (102 పరుగులు నాటౌట్), మెహదీ హసన్ మిరాజ్ (6 నాటౌట్) ఉన్నారు.

రెండో టెస్టులో రెండు, మూడు రోజులు రద్దయ్యాయి. నేటితో పాటు రేపు ఐదో రోజు ఆట మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఈ మ్యాచ్ డ్రా అవడం దాదాపు ఖాయమే. ఈ సిరీస్‍లో భారత్ తొలి మ్యాచ్ గెలువటంతో ప్రస్తుత రెండో టెస్టు డ్రా అయినా 1-0తో సిరీస్ కైవసం చేసుకుంటుంది.

Whats_app_banner