తెలుగు న్యూస్ / ఫోటో /
Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు
- Rohit Sharma: భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. శ్రీలంకతో రెండో వన్డేలో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును హిట్‍మ్యాన్ బద్దలుకొట్టాడు.
- Rohit Sharma: భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. శ్రీలంకతో రెండో వన్డేలో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును హిట్‍మ్యాన్ బద్దలుకొట్టాడు.
(1 / 5)
శ్రీలంకతో రెండో వన్డేలో నేడు (ఆగస్టు 4) భారత కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ శతకంతో దుమ్మురేపాడు. 44 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్స్‌లు బాదిన రోహిత్ 64 పరుగులు చేశాడు. (AFP)
(2 / 5)
అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్‍లో 50కంటే ఎక్కువ పరుగులను (50+) అత్యధిక సార్లు సాధించిన భారత ఓపెనర్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. భారత్ తరఫున ఓపెనర్‌గా వచ్చిన సందర్భాల్లో ఇప్పటి వరకు 121 సార్లు 50కంటే ఎక్కువ రన్స్ చేశాడు హిట్‍మ్యాన్. (PTI)
(3 / 5)
టీమిండియాకు ఓపెనింగ్ చేసిన సందర్భాల్లో 120సార్లు 50కంటే ఎక్కువ రన్స్ చేశాడు దిగ్గజం సచిన్ టెండూల్కర్. ఇప్పుడు హిట్‍మ్యాన్ దీన్ని దాటేశాడు. భారత్ తరఫున 342 ఇన్నింగ్స్‌ల్లో ఓపెనింగ్ చేసిన సచిన్ 120సార్లు 50ప్లస్ స్కోర్స్ చేశాడు. ఇప్పటి వరకు 353 మ్యాచ్‍ల్లో ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ 121సార్లు 50కంటే ఎక్కువ రన్స్ చేశాడు. కాగా, భారత తరఫున అన్ని స్థానాల్లో కలిపి సచిన్ 264సార్లు 50+ రన్స్ చేశారు. (AP)
(4 / 5)
అంతర్జాతీయ మ్యాచ్‍ల్లో ఓపెనింగ్ వచ్చి ఎక్కువసార్లు 50+ స్కోర్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్ (146) అగ్రస్థానంలో ఉన్నాడు. క్రిస్ గేల్ (144), సనత్ జయసూర్య (136), డేస్మోండ్ హేనస్ (131), గ్రేమ్ స్మిత్ (125) తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు. రోహిత్ శర్మ (121) ఆరో ప్లేస్‍కు వచ్చాడు. (AFP)
ఇతర గ్యాలరీలు