Rinku Singh: ఐపీఎల్‌లో కోహ్లి టీమ్‌లోకి రింకూసింగ్ - ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్
Rinku Singh: ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ తరఫున ఆడాలని ఉందని అన్నాడు టీమిండియా హిట్టర్ రింకూ సింగ్...ఆర్‌సీబీలో కోహ్లి ఉన్నాడు కాబట్టి అతడితో ఆడే అవకాశం కోసమైనా ఆర్‌సీబీని సెలెక్ట్ చేసుకుంటానని అన్నాడు. రింకూ సింగ్ కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
Rinku Singh: ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరఫున ఆడాలని ఉందని అన్నాడు టీమిండియా హిట్టర్ రింకూ సింగ్. ఈ మాటను అతడే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. రింకూ సింగ్ కామెంట్స్‌తో ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతోన్నారు. రింకూ సింగ్ వస్తే తప్పకుండా ఆర్‌సీబీ తలరాత మారుతుందని కామెంట్స్ చేస్తోన్నారు. ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐపీఎల్ 2025పై రింకూ సింగ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
కోల్‌కతా రీటెయిన్ చేసుకోకపోతే...
ఐపీఎల్ వేలంలో మిమ్మల్ని కోల్‌కతా నైట్ రైడర్స్ రీటెయిన్ చేసుకోకపోతే ఏ టీమ్ తరఫున బరిలోకి దిగాలని అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు ఆర్‌సీబీ అని రింకూ సమాధానం చెప్పాడు. ఆర్‌సీబీలో విరాట్ కోహ్లి ఉన్నాడు. అతడితో ఆడే అవకాశం కోసమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌ను సెలెక్ట్ చేసుకుంటానని రింకూ సింగ్ అన్నాడు.
కోహ్లి తనకు రెండు బ్యాట్‌లు గిఫ్ట్‌గా ఇచ్చాడని రింకూ సింగ్ చెప్పాడు. మొదట ఇచ్చిన బ్యాట్ విరిగిపోవడంతో మరో బ్యాట్ గిఫ్ట్‌గా కావాలని కోహ్లిని రిక్వెస్ట్ చేశానని రింకూ సింగ్ అన్నాడు. నా కోరికను కాదనకుండా విరాట్ మరో బ్యాట్ కూడా బహుమతిగా అందజేసిన సంగతిని రింకూ సింగ్ గుర్తుచేసుకోన్నాడు. కోహ్లి తనకు బ్యాట్ గిఫ్ట్‌గా ఇస్తోన్న వీడియోను ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా రింకూ సింగ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
రీటెయిన్ గురించి తెలియదు…
రీటెయిన్ గురించి కూడా రింకూ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రీటెయిన్ గురించి కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ తనతో ఎలాంటి చర్చలు, సంప్రదింపులను ఇప్పటివరకు జరపగలేదని రింకూ సింగ్ అన్నాడు. ఎవరిని కేకేఆర్ రీటెయిన్ చేసుకుంటుందన్నది కూడా తనకు తెలియదని రింకూ సింగ్ తెలిపాడు.
వేలంలో పాల్గొనాలని ఉంది...
ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొనాలని తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. అయితే వేలంలోగా ఏమైనా జరగొచ్చు అని రింకూ సింగ్ చెప్పాడు. అతడి కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి. ప్రస్తుతం యాభై ఐదు లక్షల బేస్ ధరతోనే కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌లో రింకూ కొనసాగుతోన్నాడు. ఒకవేళ రింకూ సింగ్ ఐపీఎల్ వేలంలో పాల్గొంటే ఐదారు కోట్లకుపైనే ధర పలికే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతోన్నాయి.
ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు...
2023 ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో ఐదు సిక్సర్లు కొట్టి కోల్‌కతాను గెలిపించాడు రింకూ సింగ్. ఈ మ్యాచ్‌తో ఓవర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయాడు. ఆ సీజన్‌లో నాలుగు హాఫ్ సెంచరీలతో 474 పరుగులు చేసి టాప్ స్కోరర్లలో ఒకరిగా నిలిచాడు.
26 టాప్ స్కోరు...
2024 సీజన్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు రింకూ సింగ్. 14 మ్యాచుల్లో 168 రన్స్ మాత్రమే చేశాడు. 26 అతడి హయ్యెస్ట్ స్కోరు కావడం గమనార్హం.
ఐపీఎల్ మెరుపులతో టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇప్పటివరకు టీమిండియా తరఫున 23 టీ20 మ్యాచ్‌లు , రెండు వన్డేలు ఆడాడు.