Mayank Yadav : టీ20 వరల్డ్​ కప్​కు మయాంక్​ యాదవ్​ ఫిక్స్​! ఆ స్టార్​ బౌలర్​ స్థానంలో..-mayank yadav for t20 world cup indian pacer tipped to be shamis replacement ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Mayank Yadav : టీ20 వరల్డ్​ కప్​కు మయాంక్​ యాదవ్​ ఫిక్స్​! ఆ స్టార్​ బౌలర్​ స్థానంలో..

Mayank Yadav : టీ20 వరల్డ్​ కప్​కు మయాంక్​ యాదవ్​ ఫిక్స్​! ఆ స్టార్​ బౌలర్​ స్థానంలో..

Sharath Chitturi HT Telugu
Apr 08, 2024 04:36 PM IST

Mayank Yadav IPL 2024 : ఐపీఎల్​ 2024 సెన్సెషన్​ మయాంక్​ యాదవ్​కు టీ20 వరల్డ్​ కప్​ టీమిండియా స్క్వాడ్​లో చోటు దక్కుతుందా? అంటే.. కచ్చితంగా ఇవ్వాలని అంటున్నారు మాజీ సెలక్టర్​. అతను అర్హుడని చెబుతున్నారు.

మయాంక్​ యాదవ్​కి టీ20 వరల్డ్​ కప్​లో చోటు ఫిక్స్​!
మయాంక్​ యాదవ్​కి టీ20 వరల్డ్​ కప్​లో చోటు ఫిక్స్​! (AP)

Mayank Yadav in T20 world cup : ఐపీఎల్​ 2024లో తన స్పీడ్​ బౌలింగ్​తో సంచలనం సృష్టించి, అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు మయాంక్​ యాదవ్​. అతనిపై దిగ్గజ ప్లేయర్ల నుంచి సీనియర్​ ఆటగాళ్ల వరకు.. అందరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. ఇంకొన్ని నెలల్లో జరగనున్న టీ20 వరల్డ్​ కప్​కి ముందు.. మయాంక్​ యాదవ్​ ఇలాంటి ప్రదర్శన చేయడం అతనికి ప్లస్​గా మారింది. జూన్​ 1న వెస్టిండీస్​, యూఎస్​ఏ వేదికగా మొదలయ్యే టీ20 వరల్డ్​ కప్​కు వెళ్లే టీమిండియా జట్టులో అతనికి చోటు దక్కుతుందని అందరు అంచనా వేస్తున్నారు.

టీమిండియా జట్టులో మయాంక్​ యాదవ్​..!

మయాంక్​ యాదవ్​ వయస్సు 21ఏళ్లు. ఇప్పటివరకు 17 లిస్ట్​ ఏ, 13 టీ20లు, 1 ఫస్ట్​ క్లాస్​ గేమ్​ ఆడాడు. ఐపీఎల్​ 2024లో లక్నో సూపర్​ జెయింట్స్​ తరఫున ఆడుతున్న మయాంక్​.. పంజాబ్​ కింగ్స్​తో మ్యాచ్​లో చెలరేగాడు. ఐపీఎల్​ 2024లో ఫాస్టెస్ట్​ బాల్​ వేసి అందరిని ఆకర్షించాడు. ఫలితంగా.. టీ20 వరల్డ్​ కప్​ 15 మెంబర్​ టీమ్​కి బలమైన పోటీ ఇస్తున్నాడు.

ఇక బీసీసీఐ సెలక్షన్​ కమిటీ మాజీ ఛైర్మన్​ ఎంఎస్​కే ప్రసాద్​ చెప్పింది నిజమే అయితే.. గాయంతో బాధపడుతున్న మహమ్మద్​ షమీ స్థానంలో టీ20 వరల్డ్​ కప్​కు మయాంక్​ యాదవ్​ని ఎంపికి చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. జస్ప్రీత్​ బుమ్రా, మహమ్మద్​ సిరాజ్​, మయాంక్​ యాదవ్​తో కూడిన బౌలింగ్​ లైనప్​ ఇండియా సొంతం అవుతుంది.

Mayank Yadav IPL 2024 : "వరల్డ్​ కప్​ వేరే ఫార్మాట్​ అయ్యుంటే.. నేను ఇలా ఆలోచించేవాడిని కాదు. కొన్ని ద్వైపాక్షిక సిరీస్​లు ఆడిన తర్వాతే.. మయాంక్​ యాదవ్​ గురించి ఆలోచించేవాడిని. కానీ మన టాలెంట్​ని చూపించుకునేందుకు ఐపీఎల్​ ఒక గొప్ప వేదిక. పైగా.. వరల్డ్​ కప్​ జరుగుతున్నది టీ20 ఫార్మాట్​లో. మయాంక్​ యాదవ్​ ఇప్పటికే ఫేమస్​ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు," అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఎంఎస్​కే ప్రసాద్​.

"మయాంక్​ బౌలింగ్​ని, పేస్​ని ఆడేందుకు బ్యాటర్లు ఇబ్బంది పడుతుంటే.. అతను కచ్చితంగా ఉపయోగపడతాడు. టీమిండియా బౌలింగ్​ విషయానికొస్తే.. మహమ్మద్​ షమీ గాయంతో టీ20 వరల్డ్​ కప్​ ఆడలేడు. అంటే.. బుమ్రా, సిరాజ్​తో పాటు మూడో బౌలర్​ గురించి సెలక్టర్లు ఆలోచించాలి. పేస్​, అక్యురసీ మంచిగా ఉన్న వ్యక్తికి.. టీ20 వరల్డ్​ కప్​కు వెళ్లే టీమిండియా జట్టులో చోటు దక్కాలి," అని ప్రసాద్​ అభిప్రాయపడ్డారు.

T20 World Cup Team India squad : "కన్సిస్టెంట్​గా బౌలింగ్​ చేయడమే కాదు. అక్యురసీతో కూడా బౌలింగ్​ చేయాలి. మయాంక్​ విషయంలో పంజాబ్​తో మ్యాచ్​లో మనం ఇది చూశాము. అతడి పేస్​ని ఆడటానికి బ్యాటర్లు కష్టపడ్డారు. ఆర్సీబీతో మ్యాచ్​లో కూడా తన ప్రతిభను చాటాడు. పిచ్​.. బౌలింగ్​కి ఇంకా అనుకూలిస్తే.. మయాంక్​ యాదవ్​ బాల్స్​ని ఎదుర్కోవడం కష్టమే. ఛేంజ్​ ఆఫ్​ పేస్​ విషయంలో అతను అద్భుతం చేస్తున్నాడు. అందుకే.. టీ20 వరల్డ్​ కప్​ స్క్వాడ్​లో చోటుకు అతను పోటీ ఇస్తాడు," అని ఎంఎస్​కే ప్రసాద్​ చెప్పుకొచ్చారు.

Whats_app_banner

సంబంధిత కథనం