Mohit Sharma: ప‌ర్పుల్ క్యాప్ రేసులో 35 ఏళ్ల బౌల‌ర్ టాప్ - ఆరెంజ్ క్యాప్‌లో కోహ్లినే ఫ‌స్ట్ ప్లేస్‌-ipl 2024 mohit sharma lead in purple cap list kohli top in orange cap race ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Mohit Sharma: ప‌ర్పుల్ క్యాప్ రేసులో 35 ఏళ్ల బౌల‌ర్ టాప్ - ఆరెంజ్ క్యాప్‌లో కోహ్లినే ఫ‌స్ట్ ప్లేస్‌

Mohit Sharma: ప‌ర్పుల్ క్యాప్ రేసులో 35 ఏళ్ల బౌల‌ర్ టాప్ - ఆరెంజ్ క్యాప్‌లో కోహ్లినే ఫ‌స్ట్ ప్లేస్‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 06, 2024 11:24 AM IST

Mohit Sharma: ఐపీఎల్ 2024లో ప‌ర్పుల్ క్యాప్ రేసులో గుజ‌రాత్ టైటాన్స్‌కు చెందిన 35 ఏళ్ల సీనియ‌ర్ పేస‌ర్ మోహిత్ శ‌ర్మ టాప్‌లో కొన‌సాగుతోన్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లి టాప్‌లో ఉన్నాడు.

మోహిత్ శ‌ర్మ
మోహిత్ శ‌ర్మ

Mohit Sharma: ఐపీఎల్ 2024 ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. టైటిల్ ఫేవ‌రేట్ల‌లో ఒక‌టిగా బ‌రిలో దిగిన ముంబై ఇండియ‌న్స్ ఇప్ప‌టివ‌ర‌కు బోణీ కొట్ట‌లేక‌పోయింది. ఏ మాత్రం అంచ‌నాలు లేకుండా బ‌రిలో దిగిన కోల్‌క‌తా, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అదిరిపోయే విజ‌యాల‌తో పాయింట్స్ టేబుల్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచాయి.

అంతే కాకుండా ఈ సీజ‌న్‌లో ఐపీఎల్ వేలంలో కోట్లు పెట్టి కొన్న స్టార్ ప్లేయ‌ర్లు ఫ్యాన్స్‌ను డిజ‌పాయింట్ చేస్తుండోగా.. శ‌శాంక్‌సింగ్‌,అషుతోష్ రానా, అభిషేక్ శ‌ర్మ లాంటి యంగ్ అన్‌క్యాప్‌డ్ ప్లేయ‌ర్లు అంచ‌నాల‌కు మించి రాణిస్తూ క్రికెట్ అభిమానుల‌ను అల‌రిస్తున్నారు.

మోహిత్ శర్మ టాప్…

ఈ సారి ప‌ర్పుల్ క్యాప్ రేసులో గుజ‌రాత్ టైటాన్స్ సీనియ‌ర్ పేస‌ర్ మోహిత్ శ‌ర్మ ఉన్నాడు. ఈ సీజ‌న్‌లో 35 ఏళ్ల సీనియ‌ర్ పేస‌ర్ ఇప్ప‌టివ‌ర‌కు ఏడు వికెట్లు తీసుకున్నాడు. గ‌త సీజ‌న్‌లో అనుకోకుండా జ‌ట్టులోకి వ‌చ్చిన మోహిత్ శ‌ర్మ ఏకంగా 27 వికెట్లు తీశాడు. గ‌త సీజ‌న్‌లో ష‌మీ త‌ర్వాత అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా నిలిచాడు. ఈ సీజ‌న్‌లో త‌న ఫామ్‌ను కొన‌సాగిస్తోన్నాడు.

మోహిత్ శ‌ర్మ త‌ర్వాత రెండో స్థానంలో చెన్నై పేస‌ర్ ముస్తాఫిజుర్ రెహ‌మాన్(ఏడు వికెట్లు)కొన‌సాగుతోన్నాడు. ఈ సీజ‌న్‌లో అనూహ్యంగా వెలుగులోకి వ‌చ్చిన స్పీడ్‌స్టార్ మ‌యాంక్ యాద‌వ్ ఆరు వికెట్ల‌తో మూడో స్థానంలో నిలిచాడు. టాప్ ఫైవ్‌లో ముస్తాఫిజుర్ రెహ‌మాన్ మిన‌హా మిగిలిన వారంద‌రూ ఇండియా బౌల‌ర్లే ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఆరెంజ్ క్యాప్ రేసులో...

టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లి అంచ‌నాల‌కు మించి రాణిస్తోన్న ఆర్‌సీబీ మాత్రం వ‌రుస ప‌రాయాల‌తో డీలా ప‌డుతోంది. ఈ సీజ‌న్‌లో కోహ్లి సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు మ్యాచులు ఆడిన కోహ్లి 67 యావ‌రేజ్‌తో 203 ప‌రుగులు చేశాడు. కోహ్లి త‌ర్వాత 181 ప‌రుగుల‌తో రియాన్ ప‌రాగ్ సెకండ్ ప్లేస్‌లో కొన‌సాగుతోన్నాడు. హైద‌రాబాద్ హిట్ట‌ర్ క్లాసెన్ 177 ర‌న్స్‌తో మూడో స్థానంలో ఉన్నాడు.

పాయింట్స్ టేబుల్‌లో కోల్‌క‌తా ఫ‌స్ట్ ప్లేస్‌...

ఐపీఎల్ 2024 పాయింట్స్ టేబుల్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ టాప్ ప్లేస్‌లో కొన‌సాగుతోంది. మూడింటిలో మూడు విజ‌యాలు సాధించిన కోల్‌క‌తా ఆరు పాయింట్ల‌తో నంబ‌ర్ ప్లేస్‌లో నిల‌వ‌గా...మూడు విజ‌యాల‌తో రాజ‌స్థాన్ రెండో స్థానంలో కొన‌సాగుతోంది. నాలుగు మ్యాచుల్లో రెండు విజ‌యాలు, రెండు ఓట‌ముల‌తో చెన్నై సూప‌ర్ కింగ్స్ మూడో స్థానంలో నిలిచింది. నాలుగో స్థానంలో ల‌క్నో, ఐదో స్థానంలో హైద‌రాబాద్ ఉన్నాయి.

మూడు మ్యాచుల్లోమూడు ఓట‌ముల‌తో ముంబై లాస్ట్ ప్లేస్‌లో నిల‌వగా...నాలుగు మ్యాచుల్లో ఒక విజ‌యం, మూడు ఓట‌ముల‌తో ఢిల్లీ లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్‌లో కొన‌సాగుతోంది.

బెంగళూరుతో రాజస్థాన్ ఢీ…

శ‌నివారం రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ త‌ల‌ప‌డ‌నుంది. ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆర్‌సీబీ ఒకే ఒక మ్యాచ్‌లో గెలిచింది. వ‌రుస ప‌రాజ‌యాల‌కు నేటి మ్యాచ్‌తో బ్రేక్ చెప్పాల‌ని చూస్తోంది. బ‌లాబ‌లాల ప‌రంగా చూసుకుంటే ఆర్‌సీబీ కంటే రాజ‌స్థాన్ స్ట్రాంగ్‌గా ఉంది.

Whats_app_banner