IND vs BAN T20I Series: భారత్, బంగ్లాదేశ్ మధ్య టీ20 సిరీస్ షురూ.. మ్యాచ్‌ల షెడ్యూల్, టైమింగ్స్, టీమ్స్ వివరాలివే
IND vs BAN T20I Series Schedule: భారత్, బంగ్లాదేశ్ మధ్య ఆదివారం నుంచి ఆసక్తికరమైన టీ20 సిరీస్‌కి రంగం సిద్ధమైంది. మూడు టీ20ల్లో ఒక మ్యాచ్‌కి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది.
భారత్, బంగ్లాదేశ్ మధ్య ఆదివారం (అక్టోబరు 6) నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభంకానుంది. ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 2-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే.
చెపాక్‌లో జరిగిన తొలి టెస్టులో 280 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో గెలిచింది. దాంతో టీ20 సిరీస్‌ను కూడా గెలవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు కనీసం టీ20 సిరీస్ గెలిచి పరువు నిలబెట్టుకోవాలని బంగ్లాదేశ్ ఆశిస్తోంది.
భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టీ20 మ్యాచ్‌కి గ్వాలియర్‌లోని న్యూ మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ మైదానంలో అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది.
సిరీస్‌లో రెండో టీ20కి ఢిల్లీ, మూడో టీ20కి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇప్పటికే జట్లను ప్రకటించాయి. భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తుండగా, బంగ్లాదేశ్ జట్టుని నజ్ముల్ హుస్సేన్ శాంటో లీడ్ చేయబోతున్నాడు.
టీ20 సిరీస్ షెడ్యూల్
అక్టోబర్ 6న తొలి టీ20: శ్రీ మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియం, గ్వాలియర్
అక్టోబర్ 9న రెండో టీ20: అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ
అక్టోబర్ 12న మూడో టీ20: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్
మ్యాచ్ టైమింగ్స్
భారత్, బంగ్లాదేశ్ మధ్య ఈ మూడు టీ20 మ్యాచ్‌లూ భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటలకి ప్రారంభం అవుతాయి. టాస్ అరగంట ముందు పడుతుంది.
ఎక్కడ వీక్షించొచ్చు
భారత్, బంగ్లాదేశ్ మధ్య టీ20 సిరీస్‌ను టీవీల్లో స్పోర్ట్స్18 ఛానల్‌లో వీక్షించవచ్చు. ఆన్‌లైన్‌లో చూడాలనుకుంటే జియో సినిమా యాప్‌లో ఉచితంగా ఆస్వాదించవచ్చు.
భారత టీ20 జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్
బంగ్లాదేశ్ టీ20 జట్టు
నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హుస్సేన్ అమోన్, తౌహిద్ హ్రిదోయ్, మహ్మద్ ఉల్లా, లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), జకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, షేక్ మహేది హసన్, రిషద్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్. తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, తంజీమ్ హసన్ షకీబ్, షకీబుల్ హసన్.