Shakib Al Hasan: క్రికెటర్లకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుందన్న విషయం తెలుసు కదా. కానీ ఆ ఫాలోయింగే ఒక్కోసారి తలనొప్పులు తెచ్చిపెడుతుంది. తాజాగా బంగ్లాదేశ్ టెస్టు, టీ20 కెప్టెన్ షకీబుల్ హసన్ కు అలాంటి అనుభవమే ఎదురైంది. ఓ జువెలరీ షాపు ఓపెనింగ్ కోసం దుబాయ్ వెళ్లిన షకీబ్ ను చుట్టుముట్టిన అభిమానులు.. అతన్ని కాలర్ పట్టి లాగి కింద పడేశారు.,అతనితో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడంతో షకీబ్ చాలా ఇబ్బంది పడ్డాడు. చివరికి ఎలాగోలా వాళ్ల నుంచి తప్పించుకొని అక్కడి నుంచి బయటపడ్డాడు. ఈ మధ్యే ఇంగ్లండ్ తో టెస్ట్, టీ20 సిరీస్ ముగిసిన తర్వాత షకీబ్.. దుబాయ్ వెళ్లాడు. టీ20 సిరీస్ లో వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ను బంగ్లాదేశ్ వైట్ వాష్ చేసిన విషయం తెలిసిందే.,చిక్కుల్లో షకీబ్దుబాయ్ లో జరిగిన ఈ ఘటనే షకీబ్ కు చేదు అనుభవం అనుకుంటే.. అక్కడ అతడు షాపు ప్రారంభానికి వెళ్లడం కూడా వివాదానికి కారణమైంది. నిజానికి ఆ జువెలరీ షాపు యజమాని బంగ్లాదేశ్ లో ఓ పోలీస్ అధికారిని హత్య చేసి పారిపోయిన వ్యక్తి. అతని పేరు ఆరవ్ ఖాన్. అతని అసలు పేరు రబీయుల్ ఇస్లామ్. గోపాల్‌గంజ్ కు చెందిన ఇతనిపై హత్య అభియోగాలు మోపిన తర్వాత దేశం వదిలి దుబాయ్ పారిపోయాడు.,అలాంటి వ్యక్తికి చెందిన జువెలరీ షాపు ప్రారంభానికి వెళ్లకూడదని చెప్పినా కూడా షకీబ్ వెళ్లాడని, ఈ విషయంలో అతన్ని ప్రశ్నిస్తామని ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ అడిషనల్ కమిషనర్ హరూనోర్ రషీద్ చెప్పారు. వద్దని చెప్పినా షకీబ్ వినలేదని, అతన్ని ఈ విషయమై ప్రశ్నించవచ్చని ఆయన తెలిపారు. నాలుగేళ్ల కిందట స్పెషల్ బ్రాంజ్ పోలీసు అధికారిని చంపిన కేసులో ఆరవ్ ఖాన్ నిందితుడు.,,