Kohli Dhoni Hairstyle : హెయిర్ కట్‌కి.. కోహ్లీ- ధోనీ ఎంత ఖర్చు చేస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Kohli Dhoni Hairstyle cost : విరాట్ కోహ్లీ- ఎంఎస్ ధోనీలకు హెయిర్ కట్ చేసే హెయిస్ స్టైలిస్ట్.. ఎంత ఛార్జ్ చేస్తారో మీకు తెలుసా? ఇక్కడ చూసేయండి..
MS Dhoni new hairstyle : విరాట్ కోహ్లీ- ఎంఎస్ ధోనీ.. టీమిండియాలో వీరిద్దరు లెంజడరీ ప్లేయర్స్. అయితే.. ఆటలోనే కాదు ఫ్యాషన్ విషయంలో కూడా వీరిద్దరు ముందుంటారు. మరీ ముఖ్యంగా హెయిర్ స్టైల్స్‌లో ట్రెండ్‌నే సృష్టిస్తారు. కోహ్లీ హెయిర్ స్టైల్ బావుందని.. లేదు, లేదు ధోనీ హెయిర్ స్టైలే బావుందని.. ఫ్యాన్ వార్స్ కూడా నడుస్తుంటాయి. అంతా బాగుంది కానీ.. ఈ ఇద్దరు.. హెయిర్ కట్‌కి ఎంత ఖర్చు చేస్తారు? వీరికి హెయిర్ కట్ చేసే హెయిర్ స్టైలిస్ట్ ఎంత వసూలు చేస్తారు? అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఆ ప్రశ్నకు సమాధానం తెలిసిన తర్వాత మీరు షాక్ అవ్వాల్సిందే..
కోహ్లీ- ధోనీ హెయిర్ స్టైలిస్ట్ ఛార్జీలు ఎంతంటే..
ఇండియాలో ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్స్లో ఒకరు ఆలిమ్ హకిమ్. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ వంటి సెలబ్రటీలకు ఆయన హెయిర్ కట్ చేస్తూ ఉంటారు. ఇటీవలే.. తాను ఎంత ఛార్జ్ చేస్తారో చెప్పారు. ఒక సెషన్‌కి కనీసం రూ. 1లక్ష ఛార్జ్ చేస్తానని ఆయన అన్నారు.
Virat Kohli hair style cost : "హెయిర్ కట్‌కి నేను ఎంత ఛార్జ్ చేస్తానో అందరికి తెలుసు. సెషన్‌కి మినిమమ్ రూ. 1లక్ష వసూలు చేస్తాను. ఇక ఐపీఎల్ వస్తోంది కాబట్టి.. ఈసారి కొత్తగా ఏదైనా చెయ్యాలని అనుకున్నాము. కొత్త కొత్త ఎక్స్పరిమెంట్స్ కోసం విరాట్ కోహ్లీ రిఫరెన్స్ ఇస్తూ ఉంటాడు. న్యూ లుక్స్ కోసం కోహ్లీ ఇలాగే నన్ను అప్రోచ్ అవుతాడు," అని ఆలిమ్ హకిమ్ ఓ మీడియా సంస్థకు చెప్పారు.
ఇదీ చూడండి:- Virat Kohli RCB : ఆర్సీబీకి విరాట్ కోహ్లీ హీరోనా? లేక విలన్ ఆ?
"విరాట్ కోహ్లీ కొత్త హెయిర్ కట్లో ఫేడెడ్ సైడ్స్ ఉంటయి. కనురెప్పలకు స్లిట్స్ ఉంటాయి. వెనకలా మల్లెట్ ఉంటుంది. కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్‌ని ఇంటర్నెట్లో నేను పోస్ట్ చేశారు. వెంటనే వైరల్ అయ్యింది. ఇన్సేన్," అని ఆలిమ్ హకిమ్ చెప్పుకొచ్చారు.
ఎంఎస్ ధోనీ.. హాలీవుడ్ స్టార్‌కి తక్కువేం కాదు అని అన్నారు ఆలిమ్ హకిమ్.
MS Dhoni CSK IPL 2024 : "మహీ గురించి చెప్పాలంటే.. ఆయన్ని నేను చాలా డిఫరెంట్‌గా ఊహించుకుంటాను. ఒక స్టార్‌గా, కూల్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తిగా భావిస్తాను. ఆయనకి హెయిర్ కట్ చేస్తున్నప్పుడు.. రికార్డ్ చేయాలని నేనే చెబుతాను. వాటిని పోస్ట్ చేస్తాను," అని అన్నారు ఆలిమ్ హకిమ్.
హెయిర్ కట్‌కి మినిమమ్ రూ. 1లక్ష ఛార్జీలు అంటే.. ధోనీ, కోహ్లీలు దాని కన్నా ఎక్కువే ఖర్చు చేసే అవకాశం ఉంది!
ఐపీఎల్ 2024..
Virat Kohli IPL 2024 : ఇక ఐపీఎల్ 2024 విషయానికొస్తే.. విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు).. 5 మ్యాచ్‌లు ఆడి 4 మ్యాచ్‌లలో ఓడిపోయింది. పాయింట్స్ టేబుల్లో 8వ స్థానంలో ఉంది. ఇక ధోనీకి చెందిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే).. 4 మ్యాచ్‌లలో 2 గెలిచి.. పాయింట్స్ టేబుల్లో 3వ స్థానంలో కొనసాగుతోంది.
సంబంధిత కథనం