Hardik Pandya : ‘మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి’- విమర్శలపై హార్దిక్​ కామెంట్స్​!-hardik pandya ends long silence amid criticism on mis disastrous ipl 2024 start ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  Hardik Pandya Ends Long Silence Amid Criticism On Mi's Disastrous Ipl 2024 Start

Hardik Pandya : ‘మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి’- విమర్శలపై హార్దిక్​ కామెంట్స్​!

Sharath Chitturi HT Telugu
Apr 02, 2024 01:45 PM IST

Hardik Pandya Mumbai Indians : విమర్శలపై ఎట్టకేలకు స్పందించాడు ముంబై ఇండియన్స్​ కెప్టెన్​ హార్దిక్​ పాండ్యా. విమర్శించే వారిని ఉద్దేశించి ఓ ట్వీట్​ చేశాడు.

విమర్శలపై హార్దిక్​ పాండ్యా ట్వీట్​..
విమర్శలపై హార్దిక్​ పాండ్యా ట్వీట్​.. (ANI)

Hardik Pandya latest news : రోహిత్​ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించాలని ముంబై ఇండియన్స్​ నిర్ణయించుకున్నప్పటి నుంచి.. ఐపీఎల్​ 2024లో ఆ జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు! ఆడిన మూడు మ్యాచ్​లలో ఆ జట్టు ఘోరంగా ఓడిపోయింది. ఇక రోహిత్​ నుంచి సారథ్య బాధ్యతలు తీసుకున్న హార్దిక్​ పాండ్యా.. ఎక్కడికి వెళ్లినా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. స్టేడియం లోపల అయితే పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. పాండ్యాని అందరు ఎగతాళి చేస్తున్నారు. వీటన్నింటిపై ఇప్పటివరకు మౌనంగా ఉన్న హార్దిక్​ పాండ్యా.. తొలిసారిగా స్పందించాడు. అందరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటూ ఎక్స్​లో ట్వీట్​ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

హార్దిక్​ పాండ్యా కామెంట్స్​..

తన మీద, ముంబై ఇండియన్స్​ జట్టు మీద వస్తున్న విమర్శలపై ఎట్టకేలకు మంగళవారం స్పందించాడు హార్దిక్​ పాండ్యా.

Mumbai Indian IPL 2024 : "ఈ జట్టు గురించి మీరు తెలుసుకోవాల్సినది ఏదైనా ఉంటే.. అది 'వీ నెవర్​ గివప్​' (మేము వదలము). పోరాడుతూనే ఉంటాము. ముందుకు వెళుతునే ఉంటాము," అని ట్వీట్​ చేశాడు పాండ్యా.

అదే పనిగా పాండ్యాను విమర్శిస్తున్న వారందరు.. ఇప్పుడు అతని ట్వీట్​కి ఏ విధంగా జవాబిస్తారో చూడాలి.

ఇక ముంబై ఇండియన్స్​ విషయానికి వస్తే.. ఐపీఎల్​ 2024లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్​లు ఓడిపోయింది. కానీ.. ఇది ఎంఐకి చెత్త ప్రదర్శన కాదు. 2015లో రోహిత్​ శర్మ సారథ్యంలో మొదటి 4 మ్యాచ్​లు ఓడిపోయిన ముంబై ఇండియన్స్​.. కనీవినీ ఎరుగని విధంగా పుంజుకుని ఏకంగా టైటిల్​నే కైవశం చేసుకుంది. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.

IPL 2024 latest news : సోమవారం.. ఆర్​ఆర్​తో ముంబైలో ఆడిన మ్యాచ్​ని ఓడిపోయింది హార్దిక్​ సేన. తదుపరి మ్యాచ్​.. ముంబైలోనే, డీసీతో ఏప్రిల్​ 7న జరగనుంది. దాదాపు వారం రోజుల గ్యాప్​ వచ్చింది. ఈ గ్యాప్​లో.. గెలుపు బాటపట్టేందుకు జట్టు ఎలాంటి ప్రణాళికలు రచిస్తుందో అని అందరు ఆసక్తిగా ఉన్నారు.

ముంబైలోనూ హార్దిక్​ పాండ్యా పరిస్థితి ఇదే.!

హ్యాట్రిక్​ ఓటములతో ఐపీఎల్​ 2024 పాయింట్ల పట్టిక​లో అట్టడుగు స్థానంలో నిలిచింది ముంబై ఇండియన్స్​. చూస్తుంటే.. జట్టు ప్రదర్శనను ఎంఐ ఫ్యాన్స్​ పెద్దగా పట్టించుకుంటున్నట్టు లేరు! వారి ఫోకస్​ అంతా హార్దిక్​ పాండ్యా మీదే, అతడిని 'బూ' చేయడం మీదే ఉన్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. సోమవారం రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో ముంబై ఇండియన్స్​ ఫ్యాన్స్​ కాస్త శృతి మించినట్టే ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే.. వాంఖడేలో ఇలాంటి సీన్స్​ కొత్తేమీ కాదు. లెజెండరీ ప్లేయర్​, క్రికెట్​ గాడ్​గా పేరు సంపాదించుకున్న సచిన్​ టెండుల్కర్​ని కూడా ముంబై ఫ్యాన్స్​ వదల్లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం