MS Dhoni prank : చెపాక్​లో అభిమానులను ప్రాంక్​ చేసిన ధోనీ- ప్లాన్​ మామూలుగా లేదుగా! వీడియో వైరల్​..-dhoni masterminded jadejas prank wanted to give chennai paisa vasool moment ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ms Dhoni Prank : చెపాక్​లో అభిమానులను ప్రాంక్​ చేసిన ధోనీ- ప్లాన్​ మామూలుగా లేదుగా! వీడియో వైరల్​..

MS Dhoni prank : చెపాక్​లో అభిమానులను ప్రాంక్​ చేసిన ధోనీ- ప్లాన్​ మామూలుగా లేదుగా! వీడియో వైరల్​..

Sharath Chitturi HT Telugu
Apr 09, 2024 12:45 PM IST

MS Dhoni prank video : సీఎస్కే వర్సెస్​ కేకేఆర్​ మ్యాచ్​లో.. అభిమానులను ప్రాంక్​ చేశాడు ధోనీ. అతడి ప్లాన్​ని.. రవీంద్ర జడేజా రివీల్​ చేశాడు. అసలు కథ ఇక్కడ తెలుసుకోండి..

ధోనీ వేసిన ప్రాంక్​ని రివీల్​ చేసిన జడేజా..
ధోనీ వేసిన ప్రాంక్​ని రివీల్​ చేసిన జడేజా..

MS Dhoni IPL 2024 : మహేంద్ర సింగ్​ ధోనీ.. క్రికెట్​ అభిమానులకు ఈ పేరంటే ఒక ఎమోషన్​. ఐపీఎల్​ 2024లో ధోనీని చూసేందుకు క్రికెట్​ లవర్స్​ స్టేడియంలకు ఎగబడుతున్నారు. ధోనీ ఎక్కడికి వెళ్లినా.. అందరు అతడికి సపోర్ట్​ ఇస్తున్నారు. సోమవారం చెపాక్ వేదికగా జరిగిన చెన్నై సూపర్​ కింగ్స్​- కోల్​కతా నైట్​రైడర్స్​​ మ్యాచ్​లో ఇది స్పష్టంగా కనిపించింది. అయితే.. ప్రేక్షకులకు పైసా వసూల్​ ఎంటర్​టైమ్మెంట్​ ఇవ్వాలని ఫిక్స్​ అయిన ధోనీ.. ఓ ప్రాంక్​ ప్లే చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

ఇదీ జరిగింది..

కేకేఆర్​తో జరిగిన మ్యాచ్​లో 17వ ఓవర్​లో సీఎస్కే వికెట్​ పడింది. శివం దూబై ఔట్​ అయ్యాడు. ఆ తర్వాత.. స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. ఎంఎస్​ ధోనీ క్రీజ్​లోకి వస్తాడని అందరు అనుకున్నారు. స్టేడియం మొత్తం ధోనీ నినాదాలతో కిక్కిరిసిపోయింది. కానీ.. డ్రెస్సింగ్​ రూమ్​ నుంచి రవీంద్ర జడేజా బయటకు వచ్చాడు. అది చూసిన ఫ్యాన్స్​ కాస్త షాక్​ అయ్యి, నిరాశపడ్డారు. ఆ తర్వాత జరిగినదే ఇక్కడ అసలు మాటర్​!

CSK vs KKR highlights : జడేజా.. బ్యాటింగ్​కి వస్తున్నట్టే వచ్చి.. మళ్లీ యూ టర్న్​ తీసుకుని లోపలికి వెళ్లిపోయాడు. చెపాక్​లో ప్రేక్షకులకు ఏం జరుగుతోందో ఒక్క క్షణం అర్థం కాలేదు! ఇంతలో.. హెల్మెట్​ పెట్టుకుని, బ్యాట్​ పట్టుకుని.. డ్రెస్సింగ్​ రూమ్​​ నుంచి ధోనీ బయటకు వచ్చాడు. అంతే! ఫ్యాన్స్​ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ధోనీ నినాదాలతో స్టేడియం మారుమోగిపోయింది.

ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. అయితే.. జడేజా ప్రాంక్​ చేశాడని తొలుత అందరు భావించారు. కానీ.. అది ధోనీ ప్లాన్​!

శివమ్​ దూబే వికెట్​ పడిన తర్వాత.. డ్రెస్సింగ్​ రూమ్​లో జరిగిన సన్నివేశాన్ని.. సీఎస్కే ప్లేయర్​ తూషార్​ దేశ్​పాండే వివరించాడు.

Dhoni prank viral video : ""ముందు నువ్వు వెళ్లు, కానీ బ్యాటింగ్​ చేసేది నేనే," అని జడేజాతో ధోనీ చెప్పడం నాకు వినిపించింది," అని తుషార్​ చెప్పుకొచ్చాడు.

ఇదే విషయంపై రవీంద్ర జడేజా కూడా స్పందించాడు.

"చెపాక్​లో ప్రేక్షకులకు ఝలక్​ ఇవ్వాలని ధోనీ అనుకున్నాడు. వచ్చిన వారికి పైసా వసూల్​ ఎంటర్​టైన్​మెంట్​ లభిస్తుందని ధోనీ భావించాడు," అని రవీంద్ర జడేజా చెప్పుకొచ్చాడు.

అరుపులే.. అరుపులు..

MS Dhoni Andrew Russel : ఐపీఎల్​2024లో.. స్టేడియంలో ధోనీ కనిపిస్తే చాలు.. క్రికెట్​ లవర్స్​కి జోష్​ మామూలుగా ఉండటం లేదు. ఇక ధోనీ బ్యాటింగ్​కి వస్తుంటే.. ఆ జోష్​ నెక్ట్స్​ లెవల్​లో ఉంటోంది. 'ధోనీ.. ధోనీ' అంటూ స్వాగతం పలుకుతున్నారు ఫ్యాన్స్​. సోమవారం కూడా ఇదే జరిగింది. ఇక స్టేడియంలో ధోనీ పేరు మారుమోగిపోయింది. ఇదే సమంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్​గా మారింది. ధోనీ బ్యాటింగ్​కు వస్తుండగా.. ఆ అరుపులు తట్టుకోలేకపోయిన కేకేఆర్​ ఆల్​రౌండర్​ ఆండ్రూ రసెల్​.. చెవులు మూసుకోవాల్సి వచ్చింది!

రసెల్​ చెవులు మూసుకుంటున్న ఫొటోని సోషల్​ మీడియాలో షేర్​ చేసి.. 'దట్​ ఈజ్​ ధోనీ పవర్​' అంటూ కామెంట్లు పెడుతున్నారు క్రికెట్​ లవర్స్​.

IPL_Entry_Point

సంబంధిత కథనం