తెలుగు న్యూస్ / ఫోటో /
IPL 2024 Points Table: చెన్నై గెలిచినా పాయింట్ల టేబుల్లో లేని మార్పులు.. రెండో స్థానంలోనే కేకేఆర్
- IPL 2024 Points Table: సోమవారం (ఏప్రిల్ 8) కోల్‌కతా నైట్ రైడర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ గెలిచినా ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. అన్ని టీమ్స్ తమ తమ స్థానాల్లోనే ఉన్నాయి.
- IPL 2024 Points Table: సోమవారం (ఏప్రిల్ 8) కోల్‌కతా నైట్ రైడర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ గెలిచినా ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. అన్ని టీమ్స్ తమ తమ స్థానాల్లోనే ఉన్నాయి.
(1 / 6)
IPL 2024 Points Table: ఐపీఎల్ 2024లో తొలి ఓటమి చవిచూసినా కోల్‌కతా నైట్ రైడర్స్ రెండో స్థానంలోనే కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో 7 వికెట్లతో కేకేఆర్ ఓడిన విషయం తెలిసిందే. ఈ ఓటమితో కేకేఆర్ 4 మ్యాచ్ లలో 3 విజయాలు, ఒక ఓటమితో 6 పాయింట్లు, 1.528 నెట్ రన్ రేట్ తో రెండో స్థానంలోనే ఉంది. ఈ ఓటమితో టాప్ లోకి వెళ్లే అవకాశాన్ని కోల్పోయింది.
(2 / 6)
IPL 2024 Points Table: డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఈ విజయం సాధించినా పాయింట్ల టేబుల్లో పైకి వెళ్లలేకపోయింది. 5 మ్యాచ్ లలో 3 విజయాలు, 2 ఓటములతో సీఎస్కే 6 పాయింట్లు, 0.666 నెట్ రన్ రేట్ తో నాలుగో స్థానంలోనే కొనసాగుతోంది.
(3 / 6)
IPL 2024 Points Table: రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లో టాప్ లోనే కొనసాగుతోంది. కేకేఆర్ ఓడిపోవడం ఆర్ఆర్ కు కలిసి వచ్చింది. ఇక ఇప్పుడు లీగ్ లో ఓటమెరగని టీమ్ అదొక్కటే. నాలుగు మ్యాచ్ లలోనూ గెలిచి 8 పాయింట్లు, 1.120 నెట్ రన్ రేట్ తో రాజస్థాన్ తొలిస్థానంలో ఉంది.
(4 / 6)
IPL 2024 Points Table: లక్నో సూపర్ జెయింట్స్ మూడో స్థానంలోనే ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ గెలిచినా.. ఎల్ఎస్‌జీ నెట్ రన్ రేట్ ను అధిగమించలేకపోయింది. లక్నో టీమ్ 4 మ్యాచ్ లలో 3 గెలిచి, ఒకటి ఓడి 6 పాయింట్లు, 0.775 నెట్ రన్ రేట్ తో మూడో స్థానంలో కొనసాగుతోంది.
(5 / 6)
IPL 2024 Points Table: ఇక ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లో మూడు టీమ్స్ ప్రస్తుతం నాలుగేసి పాయింట్లతో ఉన్నాయి. అందులో సన్ రైజర్స్ హైదరాబాద్ 0.409 నెట్ రన్ రేట్ తో ఐదో స్థానంలో ఉండగా.. పంజాబ్ కింగ్స్ -0.220 నెట్ రన్ రేట్ తో ఆరో స్థానంలో, గుజరాత్ టైటన్స్ -0.797 నెట్ రన్ రేట్ తో ఏడో స్థానంలో ఉన్నాయి.
(6 / 6)
IPL 2024 Points Table: సీజన్లో నాలుగు మ్యాచ్ ల తర్వాత తొలి విజయం సాధించిన ముంబై ఇండియన్స్ 2 పాయింట్లు, -0.704 నెట్ రన్ రేట్ తో 8వ స్థానంలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా 5 మ్యాచ్ లలో ఒకటి గెలిచి 2 పాయింట్లు, -0.843 నెట్ రన్ రేట్ తో 9వ స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్ 2 పాయింట్లు, -1.370 నెట్ రన్ రేట్ తో చివరి స్థానంలో ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు