Sarfaraz Khan Run Out: తప్పు నాదే అంటూ సర్ఫరాజ్ రనౌట్‌పై జడేజా సారీ.. అతని రియాక్షన్ ఇదీ-sarfaraz khan run out ravindra jadeja apologizes debutant reaction wins fans hearts cricket news in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sarfaraz Khan Run Out: తప్పు నాదే అంటూ సర్ఫరాజ్ రనౌట్‌పై జడేజా సారీ.. అతని రియాక్షన్ ఇదీ

Sarfaraz Khan Run Out: తప్పు నాదే అంటూ సర్ఫరాజ్ రనౌట్‌పై జడేజా సారీ.. అతని రియాక్షన్ ఇదీ

Hari Prasad S HT Telugu
Feb 15, 2024 09:28 PM IST

Sarfaraz Khan Run Out: సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ విషయంలో తప్పు తనదే అని రవీంద్ర జడేజా అన్నాడు. అయితే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయంటూ సర్ఫరాజ్ ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నాడు.

తన తప్పిదం వల్లే సర్ఫరాజ్ రనౌటయ్యాడని చెప్పిన రవీంద్ర జడేజా
తన తప్పిదం వల్లే సర్ఫరాజ్ రనౌటయ్యాడని చెప్పిన రవీంద్ర జడేజా (ANI )

Sarfaraz Khan Run Out: టీమిండియాకు ఆడాలన్న ఎన్నో ఏళ్ల కల నిజమవడంతోపాటు వచ్చిన అవకాశాన్ని హాఫ్ సెంచరీతో రెండు చేతులా అందుకున్నాడు సర్ఫరాజ్ ఖాన్. అయితే అతని కళ్లు చెదిరే ఇన్నింగ్స్ అర్ధంతరంగా ముగిసింది. సర్ఫరాజ్ 62 పరుగుల దగ్గర ఉండగా.. జడేజా తన సెంచరీ పరుగు కోసం తొందర పడి అతని రనౌట్ కు కారణమయ్యాడు. దీనిపై తొలి రోజు మ్యాచ్ తర్వాత జడేజా క్షమాపణ చెప్పాడు.

సర్ఫరాజ్ రనౌట్.. జడేజా క్షమాపణ

ఓవైపు సర్ఫరాజ్ ఖాన్ తన తొలి టెస్టులోనే ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్ లాగా ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటున్నాడు. మరోవైపు జడేజా సెంచరీకి చేరువవుతున్నాడు. 99 పరుగుల దగ్గర ఉన్నప్పుడు మిడాన్ వైపు బంతిని ఆడి పరుగు కోసం ముందుకు వచ్చాడు. అది చూసి సర్ఫరాజ్ కూడా క్రీజు వదిలిన తర్వాత జడేజా వెనుకడుగు వేశారు. సర్ఫరాజ్ తిరిగి వెనక్కి వెళ్లే లోపే రనౌటయ్యాడు.

తన వల్లే తొలి టెస్టులో అతని ఇన్నింగ్స్ అర్ధంతరంగా ముగిసిందన్న బాధలో జడేజా తన సెంచరీని కూడా సరిగా ఎంజాయ్ చేయలేకపోయాడు. తొలి రోజు ఆట తర్వాత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తప్పు తనదే అని అంగీకరించాడు. "సర్ఫరాజ్ ఖాన్ విషయంలో బాధ కలిగింది. అది నా తప్పే. అతడు చాలా బాగా ఆడాడు" అని జడేజా ఇన్‌స్టా స్టోరీలో రాసుకున్నాడు.

సర్ఫరాజ్ రియాక్షన్ ఇదీ

అయితే ఈ విషయాన్ని సర్ఫరాజ్ తేలిగ్గా తీసుకున్నాడు. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని అన్నాడు. "ఆటలో ఇది భాగం. క్రికెట్ లో ఇలా మిస్ కమ్యూనికేషన్ సహజమే. ఒక్కోసారి రనౌట్ అవుతాం. ఒక్కోసారి రన్స్ వస్తాయి. లంచ్ సమయంలో జడేజాతో మాట్లాడాను. తాను ఆడే సమయంలో తనతో మాట్లాడుతూనే ఉండాల్సిందిగా కోరాను. ఆడే సమయంలో మాట్లాడటం నాకు ఇష్టం. నేను బ్యాటింగ్ కు వచ్చిన సమయంలో మాట్లాడుతూనే ఉండాలని కోరాను. అతడు నాకు చాలా సపోర్ట్ చేశాడు" అని సర్ఫరాజ్ చెప్పాడు.

సర్ఫరాజ్ ఖాన్ 66 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్ తో 62 రన్స్ చేశాడు. ధాటిగా ఆడిన అతడిని చూస్తే తొలి టెస్టులోనే సెంచరీ చేయడం ఖాయంగా కనిపించింది. కానీ జడేజా తొందరపాటుకు సర్ఫరాజ్ తన వికెట్ ను త్యాగం చేయాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ లో రోహిత్, జడేజా సెంచరీలతోపాటు సర్ఫరాజ్ హాఫ్ సెంచరీతో తొలి రోజు తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 5 వికెట్లకు 326 రన్స్ చేసింది.

Whats_app_banner