తెలుగు న్యూస్ / ఫోటో /
Rohit Sharma Sarfaraz Khan: రోహిత్ శర్మ, సర్ఫరాజ్ ఖాన్ రికార్డులు.. దంచికొట్టిన టీమిండియా ప్లేయర్స్
- Rohit Sharma Sarfaraz Khan: ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి రోజు ఆటలో కెప్టెన్ రోహిత్ శర్మ, తొలి టెస్ట్ ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ రికార్డులు క్రియేట్ చేశారు. ఈ ఇద్దరూ పరుగుల వరద పారించడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది.
- Rohit Sharma Sarfaraz Khan: ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి రోజు ఆటలో కెప్టెన్ రోహిత్ శర్మ, తొలి టెస్ట్ ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ రికార్డులు క్రియేట్ చేశారు. ఈ ఇద్దరూ పరుగుల వరద పారించడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది.
(1 / 6)
Rohit Sharma Sarfaraz Khan: ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ సెంచరీ బాదాడు. ఈ ఇన్నింగ్స్ లో అతడు 3 సిక్స్ లు కొట్టాడు. దీంతో ఇండియా తరఫున టెస్టుల్లో అత్యధిక సిక్స్ లు కొట్టిన బ్యాటర్ల లిస్టులో ధోనీని వెనక్కి నెట్టి రెండో స్థానానికి దూసుకెళ్లాడు.(AFP)
(2 / 6)
Rohit Sharma Sarfaraz Khan: రోహిత్ శర్మ కొట్టిన మూడు సిక్స్ లతో టెస్టుల్లో ఇప్పటి వరకూ అతని సిక్స్ ల సంఖ్య 78కి చేరింది. ఇప్పటి వరకూ 77 సిక్స్ లతో రెండోస్థానంలో ఉన్న ధోనీని రోహిత్ అధిగమించాడు.(BCCI-X)
(3 / 6)
Rohit Sharma Sarfaraz Khan: ఇప్పటికే టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యధిక సిక్స్ లు బాదిన కెప్టెన్ గా రోహిత్ శర్మకు రికార్డు ఉంది. అయితే ఓవరాల్ వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత రెండోస్థానంలో నిలిచాడు.(BCCI-X)
(4 / 6)
Rohit Sharma Sarfaraz Khan: టీమిండియా తరఫున వీరేంద్ర సెహ్వాగ్ టెస్టుల్లో 91 సిక్స్ లు కొట్టాడు. రోహిత్ శర్మ ఇప్పుడిక వీరూ రికార్డును బ్రేక్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. టెస్టుల్లో 11వ సెంచరీ చేసిన రోహిత్.. ఇంగ్లండ్ పై తన మూడో సెంచరీ చేశాడు.(Surjeet Yadav)
(5 / 6)
Rohit Sharma Sarfaraz Khan: ఇండియా తరఫున తొలి టెస్టు ఆడిన సర్ఫరాజ్ ఖాన్ కూడా హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అతడు కేవలం 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం విశేషం.(REUTERS)
ఇతర గ్యాలరీలు