IPL 2024 Most expensive players : కోట్లు కోట్లు పోసి కొన్నారు- ప్రదర్శన మాత్రం నిల్!
IPL 2024 latest news : ఐపీఎల్ 2024లో అత్యధిక ధరలు పలికిన ప్లేయర్ల ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. వీరి ప్రదర్శన.. జట్టును ప్రభావితం చేయట్లేదు!
Most expensive players in IPL 2024 : ఐపీఎల్ 2024లోకి.. వాళ్లు చాలా రెప్యూటేషన్లో అడుగుపెట్టారు. వాళ్లందరిపై ఫ్రాంఛేజీలు వెచ్చించిన మొత్తం ధర రూ. 123.7 కోట్లు. వాళ్లల్లో ఇద్దరు.. ఐపీఎల్ చరిత్రలోనే 'ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్'గా రికార్డ్ సృష్టించారు. కానీ.. ప్రదర్శన విషయానికొస్తేనే.. ఫ్రాంఛేజీలకు తల పట్టుకోవాల్సిన పరిస్థితి! ఐపీఎల్ 17వ సీజన్ మొదలై దాదాపు 15 రోజులు గడిచినా.. టాప్ 10 మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్‌లో కనీసం ఒక్కరు కూడా టోర్నీలో ఇంపాక్ట్ చూపించలేకపోయారు. వారిలో కొందరి స్టాట్స్ని ఇక్కడ చూద్దాము..
కోట్లు కోట్లు పలికారు.. ప్రదర్శన మాత్రం..!
మిచెల్ స్టార్క్:- కోట్లు పలికి.. ప్రదర్శనలో డీలా పడిన వారి లిస్ట్‌లో మొదటి స్థానం మిచెల్ స్టార్క్‌దే! రూ. 24.75 కోట్లు పెట్టి కేకేఆర్.. ఈ ఆస్ట్రేలియన్ స్టార్ బౌలర్‌ని కొనుక్కుంది. వన్డే క్రికెట్లో.. ఆల్ టైమ్ గ్రేట్‌లో స్టార్క్ ఒకడు. ఇందులో డౌటే లేదు. కానీ ఐపీఎల్ 2024 విషయానికొచ్చేసరికి.. ఈ పేస్ బౌలర్ తేలిపోయాడు. ఈ సీజన్లో ఆడిన మొదటి రెండు మ్యాచ్‌లో ఒక్కటంటే ఒక్క వికెట్ మాత్రమే తీసిన స్టార్క్.. 100 పరుగులు సమర్పించుకున్నారు. అతడి బౌలింగ్‌ని ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ ప్లేయర్లు ఉతికారేశారు! దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం కాస్త పర్వాలేదు అనిపించాడు. కానీ మొదటి 6 ఓవర్లలో అతని ఎకానమీ 10.1గానే ఉంది. కేకేఆర్‌కి ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే.. తమ స్టార్ ప్లేయర్ సరైన ప్రదర్శన చేయకపోయినా.. మొదటి మూడు మ్యాచ్‌లు గెలిచింది ఆ జట్టు. కానీ కీలకమైన మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ సరైన ప్రదర్శన చేయడం చాలా అవసరం.
ప్యాట్ కమిన్స్:- సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కి బాధ కలిగించినా.. ఈ విషయం ఒప్పుకోవాలి. రూ. 10.5 కోట్లు పలికిన ప్యాట్ కమిన్స్.. ఇంకా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. వాస్తవానికి.. టీ20 క్రికెట్లో ప్యాట్ కమిన్స్ అంత గొప్ప బౌలర్ కాదు. కానీ అతని కెప్టెన్సీ స్కిల్స్‌ని మెచ్చుకోవాల్సిందే. 2023 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా జట్టును ముందుండి నడిపించాడు.
IPL 2024 most expensive players : ఐపీఎల్ 2024లో ఎస్ఆర్హెచ్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌లలో.. 5 వికెట్లు పడగొట్టాడు ప్యాట్ కమిన్స్. ఇన్నింగ్స్ మొదట్లో అతను బౌలింగ్ వేయడం లేదు. 7-15 ఓవర్లో బౌలింగ్ చేస్తున్నాడు. ఫలితంగా అతని ఎకానమీ 7.75గా ఉంది. రన్స్ని కంట్రోల్ చేయడమే కాదు.. అతడి నుంచి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనను అటు అభిమానులు, ఇటు యాజమాన్యం ఆశిస్తోంది. మరీ ముఖ్యంగా.. 4 మ్యాచ్‌లలో రెండు ఓటముల కారణంగా.. ఆ జట్టు టాప్-4లో కూడా లేదు.
డారిల్ మిచెల్:- 2023 వరల్డ్ కప్‌లో ప్రదర్శన ఆధారంగా మిచెల్‌ని రూ. 14 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్ సీఎస్కే. కానీ అతని ప్రదర్శన కూడా అంతంతమాత్రమే. 4 మ్యాచ్‌లలో 93 పరుగులు మాత్రమే చేశారు. హైయెస్ట్ స్కోర్ 34 మాత్రమే.
హర్షల్ పటేల్:- మంచి బౌలర్‌గా హర్షల్ పటేల్‌కి పేరు ఉంది. స్లో డెలివరీలు వేసి, డెత్ ఓవర్స్‌లో పరుగులను కట్టడి చేస్తాడన్న గుర్తింపు ఉంది. అందుకే.. పంజాబ్ కింగ్స్ జట్టు అతడిని రూ .11.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కానీ ఐపీఎల్2024లో 48 బాల్స్ వేసి.. 118 రన్స్ సమర్పించుకున్నాడు. ఎకానమీ 14.8గా ఉంది.
IPL 2024 latest news : అల్జారీ జోసెఫ్:- ఆర్సీబీ.. ఇతడిని రూ. 11.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కానీ ఆడిన మూడు మ్యాచ్‌లలో ఈ బౌలర్ ఓవరుకు 11.89 రన్స్ సమర్పించుకున్నాడు! 22 డెలివరీల్లో 47 రన్స్ ఇచ్చాడు.
ఐపీఎల్ 2024లో ఇంకా చాలా మ్యాచ్‌లు ఉన్నాయి. కానీ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తేనే.. ఆయా జట్లు పాయింట్స్ టేబుల్లో టాప్‌లోకి వెళ్లే అవకాశాలు మరింత మెరుగుపడతాయి.
సంబంధిత కథనం