Vizianagaram Crime : విజయనగరంలో దారుణం, ఆరు నెలల చిన్నారిపై తాత లైంగిక దాడి-vizianagaram crime news drunk man abused six month old infant pocso case booked ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vizianagaram Crime : విజయనగరంలో దారుణం, ఆరు నెలల చిన్నారిపై తాత లైంగిక దాడి

Vizianagaram Crime : విజయనగరంలో దారుణం, ఆరు నెలల చిన్నారిపై తాత లైంగిక దాడి

Vizianagaram Crime : విజయనగరం జిల్లాలో ఓ మృగాడు ఆరు నెలల చిన్నారిపై దారుణానికి పాల్పడ్డాడు. ఉయ్యాలలో నిద్రపోతున్న చిన్నారిపై తాత వరసైన వ్యక్తి లైంగిక దాడి చేశాడు.

విజయనగరంలో దారుణం, ఆరు నెలల చిన్నారిపై తాత లైంగిక దాడి

Vizianagaram Crime : విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆరు నెలల చిన్నారిపై ఓ మృగాడు లైంగిక దాడి చేశాడు. బొబ్బిలిలోని రామభద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు నెలల చిన్నారిపై మద్యం మత్తులో ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఉయ్యాలలో నిద్రపోతున్న చిన్నారిపై తాత వరసైన వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారిని తల్లి ఉయ్యాలలో పడుకోబెట్టి స్థానిక కిరాణా దుకాణానికి వెళ్లింది. కొద్దిసేపటికి నార్లవలస గ్రామానికి చెందిన బి.ఎరుకన్న దొర ఇంట్లోకి ప్రవేశించి చిన్నారి లైంగిక దాడి చేశాడు. చిన్నారి బిగ్గరగా ఏడవడంతో అక్కాచెల్లెళ్లు ఇంట్లోకి వచ్చారు. జరిగిన సంఘటనను వారు తల్లికి చెప్పారు. దీంతో నిందితుడిని అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడిని పట్టుకునేందుకు గ్రామస్తులు వెంబడించారు, అయితే అతను తప్పించుకోగలిగాడు. గాయపడిన చిన్నారిని ప్రాథమిక చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విజయనగరంలోని మరో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడుని నార్లవలసలో పట్టుకున్నారు. పోక్సో చట్టం కింద అతడిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని చిన్నారి తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

"నిన్న రామభద్రపురం పీఎస్ పరిధిలో ఓ దారుణ ఘటన జరిగింది. నిన్న మార్నింగ్ తన ఆరు నెలల చిన్నారికి స్నానం చేయించి ఉయ్యాలలో పడుకోబెట్టి పక్కన కిరాణా షాపునకు వెళ్లింది. ఆమె బయటకు వెళ్లగానే, తనకు బాబాయ్ వరసయ్యే ఎరుకన్న దొర అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లాడు. షాపులో వస్తున్న తీసుకుంటుండగా... పక్కింటి వాళ్లు పిల్ల ఏడుస్తుందని ఆమెతో చెప్పారు. దీంతో తన ఉన్న పెద్దమ్మాయిని చెల్లి ఏడుస్తుందని చూడు అని పంపింది. పెద్దమ్మాయి ఇంట్లోకి వెళ్లి చూసే సరికి ఎరుకన్న దొర చేతిలో పాప ఉంది. చిన్నారి ప్రైవేట్ పార్ట్ నుంచి కాస్త బ్లెడ్ వస్తుంది. ఈ విషయాన్ని పెద్దమ్మాయి తల్లికి చెప్పింది. దీంతో వెంటనే తల్లి అక్కడకు వచ్చింది. చిన్నారిని ఎరుకన్న ఉయ్యాలలో వేసి పారిపోయాడు. తల్లి చిన్నారిని తీసుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చింది. కొత్త చట్టం బీఎన్ఎస్ కింద, పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశాం. ఎస్పీ ఆదేశాలతో ముందు చిన్నారిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇవాళ ఉదయం ఎరుకన్న దొరను అరెస్టు చేశాం. అతడి దుస్తులపై బ్లెడ్ ఉంది. వాటిని సీజ్ చేశాం. ముద్దాయిని ఇవాళ కోర్టులో ప్రవేశపెడతాము"- బొబ్బిలి డీఎస్సీ శ్రీనివాసరావు

సంబంధిత కథనం