Guntur District : ఫొటోల పేరుతో యువతిపై లైంగిక దాడి - నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష
Guntur District Crime News : యువతిపై లైంగిక దాడిలో కేసులో గుంటూరులోని కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించింది.
యువతిపై లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ కేసులో నిందితుడికి జైలు శిక్షతో పాటు రూ.53 వేలు జరిమానా కూడా న్యాయస్థానం విధించింది. 2020లో జరిగిన ఈ ఘటనలో గుంటూరు ఐదో అదనపు జిల్లా జడ్జి కె. నీలిమ తీర్పు ఇచ్చారు. ఫోటోల పేరుతో యువతిని లొంగదీసుకొని ఆమె లైంగిక దాడికి పాల్పడ్డాడు.
కేసు వివరాలు….
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముగ్గురోడ్‌కు చెందిన తాతపూడి అనిల్ కుమార్ నివసిస్తున్నాడు. వారి ఎదురింట్లో 19 ఏళ్ల యువతిని నివాసం ఉంటుంది. ఆమె కనిపించినప్పుడల్లా హాయ్ చెపుతూ పలకరించేవాడు. ఇలా ప్రతిసారి చేసేవాడు. ఒక రోజు ఆమెను కలిశాడు. తన వద్ద నీ ఫోటోలు ఉన్నాయని…. తన ఇంటికి వస్తే వాటిని చూపిస్తానని నమ్మించి, ఆయన ఇంటికి తీసుకెళ్లాడు.
కానీ అనిల్ కుమార్ వద్ద ఫోటోలు లేవు. ఆమెను లొంగదీసుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. అప్పుడే ఆమెతో కొన్ని ఫోటోలు దిగాడు. వాటిని అడ్డం పెట్టుకొని నిరంతరం ఆమెను వేధిస్తుండేవాడు. అలాగే అనిల్ కుమార్ బెదిరింపులకు దిగడంతో ఆమె భయపడింది. ఇలా కొంత కాలం చేశాడు. అయితే ఆమె ఎలాగోలా అనిల్ కుమార్ వద్ద ఉన్న ఫోటోలు డిలీట్ చేయాలని నిర్ణయించుకుంది. అమె మెల్లగా అతని వద్దనున్న ఫోన్ తీసుకుని ఆ ఫోటోలను డిలీట్ చేసింది.
కొంత కాలం గడిచిన తరువాత ఆ ఫోటోలు తన వద్ద ఉన్నాయని… తన భార్యా రీకవర్ యాప్ ద్వారా రికవర్ చేసినట్లు ఆమెతో అనిల్ కుమార్ చెప్పాడు. దీంతో ఆ యువతి భయభ్రాంతులకు లోనైంది. 2020 జనవరి 1న ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించి ఆ యువతిని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని విజయవాడంలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. అయితే అదే సమయంలో అనిల్ కుమార్ భార్య ఆ హోటల్‌కు వచ్చి యువతిని కొట్టి పోలీసులకు ఫోన్ చేసింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని అందరిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
అనిల్ కుమార్ తనను బెదిరించి అత్యాచారం చేశాడని యువతి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ ఫిర్యాదును తాడేపల్లి పోలీస్ స్టేషన్‌కు పంపించారు. ఫిర్యాదు అందుకున్న తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసిన తరువాత సీఐ అంకమ్మరావు కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. అనంతరం కోర్టులో ఏపీపీ పల్లపు కృష్ణ ప్రాసిక్యూషన్ నిర్వహించారు. అనిల్ కుమార్‌పై నేరం రుజువు అయింది. దీంతో ఆయనకు పదేళ్లు జైలు శిక్ష, రూ.53 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కె. నీలిమ తీర్పు ఇచ్చారు.
ఇద్దరికి ఐదేళ్ల శిక్ష
ఓ మహిళను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ఇద్దరకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. బాపట్ల జిల్లా వేటపాలెం రెడ్లలొంపకు చెందిన మహిళను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో చీరాల అడిషనల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం.సుధా ఇద్దరు నేరస్తులకు ఐదేళ్ల జైలు శిక్ష విధించారు.
బాపట్ల ఎస్‌పీ వకుల్ జిందాల్ తెలిపిన వివరాల ప్రకారం… రెండ్లలొంపకు చెందిన కంజుల అంజమ్మ తనకు రావల్సిన అప్పు అడగానికి వెళ్లిన సమయంలో నేరస్తులిద్దరూ ఆమెను అవమానించారు. ఆ అవమానం భరించలేక ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె కొడుకు కంజుల మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ షేక్ మస్తాన్ షరీఫ్ కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ముగ్గురు ముద్దాయిలు ఉన్నారు.
ఈ కేసులో ముగ్గురు ముద్దాయిలను ఎస్ఐ షరీఫ్ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ కేసులు మూడో ముద్దాయి రోశమ్మ అనారోగ్యం కారణంగా ముడేళ్ల క్రితమే చనిపోయింది. ఈ కేసుపై చీరాల అడిషనల్ సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. ప్రస్తుత ఎస్ఐ జీ సురష్ సాక్షులకు రక్షణగా ఉంటూ సాక్ష్యం చెప్పే విధంగా చేశారు. సాక్షులను కానిస్టేబుల్ పీ శ్రీనివాసరావు కోర్టులో హాజరు పరిచారు. ఏపీపీ పీ. పద్మజ వాదనలు వినిపించి నేరాన్ని సాక్షాదారాలతో రుజువు చేశారు. దీంతో న్యాయమూర్తి ఎం.సుధా నేరస్తులకు ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించారు.