SCR Helpline Numbers : ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు, మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు విజయవాడ డీఆర్ఎం ప్రకటించారు. భారీ వర్షాల దృష్ట్యా విజయవాడ డివిజన్ లో హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. ప్రయాణికులు హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేసి రైళ్ల సమాచారాన్ని పొందవచ్చని రైల్వే అధికారులు సూచించారు. అలాగే దక్షిణ మధ్య రైల్వే సైతం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది.
విజయవాడ డివిజన్‌లో భారీ వర్షాల కారణంగా, ప్రయాణికుల భద్రతా కారణాల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేశారు. ఈ మేరకు విజయవాడ డీఆర్ఎం ఓ ప్రకటన చేశారు. నేటి నుంచి మూడ్రోజుల పాటు మొత్తంగా 20 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
సంబంధిత కథనం