Vijayawada Trains Cancelled : ఏపీలో భారీ వర్షాలు-విజయవాడ డివిజన్ లో 20 రైళ్లు రద్దు
Vijayawada Trains Cancelled : భారీ వర్షాల కారణంగా విజయవాడ డివిజన్ లో 20 రైళ్లు రద్దు చేశారు. ఈ మేరకు విజయవాడ డీఆర్ఎం ప్రకటన జారీ చేశారు. నేటి నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు రైళ్లు రద్దు చేసినట్లు తెలిపారు.
Vijayawada Trains Cancelled : విజయవాడ డివిజన్‌లో భారీ వర్షాల కారణంగా, ప్రయాణికుల భద్రతా కారణాల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేశారు. ఈ మేరకు విజయవాడ డీఆర్ఎం ఓ ప్రకటన చేశారు. నేటి నుంచి మూడ్రోజుల పాటు మొత్తంగా 20 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
రద్దైన రైళ్లు
- 07279- విజయవాడ టు తెనాలి- 01.09.24న రద్దు చేశారు.
- 07575- తెనాలి టు విజయవాడ - 01.09.24న రద్దు
- 07500- విజయవాడ టు గూడూరు- 31.08.24న రద్దు
- 07458- గూడూరు టు విజయవాడ- 01.09.24న రద్దు
- 17257- విజయవాడ టు కాకినాడ పోర్ట్ - 31.08.24న రద్దు
- 07874 -తెనాలి టు రేపల్లె -31.08.24 & 01.09.24న రద్దు
- 07875 -రేపల్లె టు తెనాలి -31.08.24 & 01.09.24న రద్దు
- 07868- గుడివాడ టు మచిలీపట్నం -31.08.24 & 01.09.24న రద్దు
- 07869 -మచిలీపట్నం టు గుడివాడ- 31.08.24 & 01.09.24 తేదీల్లో రద్దు
- 07885- భీమవరం జంక్షన్ టు నిడదవోలు - 31.08.24 & 01.09.24 తేదీల్లో రద్దు
- 07886- నిడదవోలు టు భీమవరం జంక్షన్ -31.08.24 & 01.09.24 తేదీల్లో రద్దు
- 07281- నర్సాపూర్ టు గుంటూరు- 31.08.24 & 01.09.24 తేదీల్లో రద్దు
- 07784- గుంటూరు టు రేపల్లె- 31.08.24 & 01.09.24 తేదీల్లో రద్దు
- 07785- రేపల్లె టు గుంటూరు -31.08.24 & 01.09.24 తేదీల్లో రద్దు
- 07976- గుంటూరు టు విజయవాడ - 31.08.24 & 01.09.24 తేదీల్లో రద్దు
- 17269- విజయవాడ టు నర్సాపూర్ -31.08.24 & 01.09.24 తేదీల్లో రద్దు
- 07576- ఒంగోలు టు విజయవాడ - 31.08.24 & 01.09.24 తేదీల్లో రద్దు
- 07898- విజయవాడ టు మచిలీపట్నం -31.08.24 & 01.09.24 తేదీల్లో రద్దు
- 07899- మచిలీపట్నం టు విజయవాడ -01.09.24 & 02.09.24 తేదీల్లో రద్దు
- 07461- విజయవాడ టు ఒంగోలు -01.09.24 & 02.09.24 తేదీల్లో రద్దు
వాల్తేరు డివిజన్ లో
భద్రతా కారణాలతో రెండు రైళ్లను రద్దు చేస్తూ వాల్తేరు డివిజన్ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి నాలుగు రైళ్లకు అదనపు కోచ్‌లను తాత్కాలిక ప్రాతిపదికన పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.
రద్దు అయిన రైళ్లు
జీఎంఆర్ చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరే జీఎంఆర్ చెన్నై సెంట్రల్-భువనేశ్వర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (06073) రైలును రద్దు చేశారు. ఈ రైలు సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 9 వరకు రద్దు చేశారు. అలాగే భువనేశ్వర్ నుంచి బయలుదేరే భువనేశ్వర్-జీఎంఆర్ చెన్నై సెంట్రల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (06074) రైలును రద్దుచేశారు. ఈ రైలును సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 10 వరకు రద్దు చేశారు.
పండగలకు ప్రత్యేక రైళ్లు
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. పండగల సమయంలో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా సౌత్ సెంట్రల్ రైల్వే చర్యలు చేపట్టింది. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దసరా, దీపావళి, ఛాత్ పండగలకు 48 స్పెషల్ రైళ్లును అందుబాటులోకి తెస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 25 మధ్య ఈ రైళ్లు రాకపోకలు నిర్వహిస్తాయని తెలిపారు. దీంతో ప్రయాణికుల రద్దీ తగ్గే అవకాశం ఉందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.
కాకినాడ టౌన్-సికింద్రాబాద్ (07122) స్పెషల్ రైలు అక్టోబర్ 7 నుంచి నవంబర్ 4 వరకు అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్-కాకినాడ టౌన్ (07188) స్పెషల్ రైలు అక్టోబర్ 8 నుండి నవంబర్ 5 వరకు అందుబాటులో ఉంటుంది. తిరుపతి కాచిగూడ (07654) స్పెషల్ రైలు అక్టోబర్ 11 నుండి నవంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుంది.
కాచిగూడ-తిరుపతి (07653) స్పెషల్ రైలు అక్టోబర్ 10 నుంచి నవంబర్ 11 వరకు అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్-నాగర్‌సోల్ (07517) స్పెషల్ రైలు అక్టోబర్ 9 నుండి నవంబర్ 6 వరకు, నాగర్‌సోల్-సికింద్రాబాద్ (07518) స్పెషల్ రైలు అక్టోబర్ 10 నవంబర్ 7 వరకు అందుబాటులో ఉంటుంది. తిరుపతి-మచిలీపట్నం స్పెషల్ రైలు, మచిలీపట్నం-తిరుపతి స్పెషల్ రైలు అందుబాటులో ఉంటాయి.
నాలుగు రైళ్లకు అదనపు కోచ్‌లు పెంపు
ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి నాలుగు రైళ్లకు అదనపు కోచ్‌లను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. సంబల్పూర్-నాందేడ్ సూపర్-ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20809) రైలుకు అదనపు కోచ్‌లు పెంచారు. ఈ రైలుకు ఒక 3వ ఏసీ, ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌లు పెంచారు. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు పెంచిన కోచ్‌లతో రైలు ప్రయాణిస్తుంది.
నాందేడ్- సంబల్పూర్ సూపర్-ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20810) రైలుకు అదనపు కోచ్‌లు పెంచారు. ఈ రైలుకు ఒక 3వ ఎసీ, ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌లు పెంచారు. సెప్టెంబర్ 2 నుండి అక్టోబర్ 1 వరకు పెంచిన కోచ్‌లతో రైలు ప్రయాణిస్తుంది. సంబల్పూర్-ఈరోడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08311) రైలుకు అదనపు కోచ్‌లు పెంచారు. ఈ రైలుకు ఒక 3వ ఏసీ, ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌లు పెంచారు. సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 25 వరకు పెంచిన కోచ్‌లతో రైలు ప్రయాణిస్తుంది.
ఈరోడ్- సంబల్‌పూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08312) రైలుకు అదనపు కోచ్‌లు పెంచారు. ఈ రైలుకు ఒక 3వ ఎసీ, ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌లు పెంచారు. సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 27 వరకు పెంచిన కోచ్‌లతో రైలు ప్రయాణిస్తుంది. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ కే. సందీప్ కోరారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం