Minister Roja : అతని తల్లిదండ్రుల పెంపకం అలాంటిది, బండారు వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి రోజా-tirupati minister roja responded on bandaru satyanarayana comments criticizes chandrababu protest ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Minister Roja : అతని తల్లిదండ్రుల పెంపకం అలాంటిది, బండారు వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి రోజా

Minister Roja : అతని తల్లిదండ్రుల పెంపకం అలాంటిది, బండారు వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి రోజా

Bandaru Satyaprasad HT Telugu
Oct 02, 2023 04:12 PM IST

Minister Roja : బండారు సత్యనారాయణ తనపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. టీడీపీ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని, కోర్టుల్లో వారికి తగిన శిక్ష పడుతుందని స్పష్టం చేశారు.

మంత్రి రోజా
మంత్రి రోజా

Minister Roja : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి... మంత్రి రోజాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఓ వ్యక్తి మహిళా మంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమన్నారు. ఆయన వ్యాఖ్యలు వింటే అతని తల్లిదండ్రుల పెంపకం ఎలాంటిదో అర్థమవుతోందన్నారు. స్థాయిని బట్టి కాకుండా ప్రతి మహిళకు సరైన గౌరవం దక్కాలని అభిప్రాయపడ్డారు. మహిళలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్న మంత్రి రోజా... టీడీపీ నేతలు సంస్కారం లేకుండా, మహిళలను అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారికి న్యాయస్థానం తగిన శిక్ష విధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా.. చంద్రబాబు, పవన్ పై ఘాటైన విమర్శలు చేశారు. చంద్రబాబు గాడ్సే కంటే ఘోరమైన వ్యక్తి అంటూ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. గాంధీని అవమానించేందుకు ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారన్నారు. ఏపీ ప్రజలు చంద్రబాబును తరిమికొట్టాలని పిలుపు నిచ్చారు. ప్రజల డబ్బు దోచుకున్న చంద్రబాబు దీక్ష పేరుతో అమరవీరులను అవమానిస్తున్నారన్నారు.

yearly horoscope entry point

చంద్రబాబు, భువనేశ్వరి దీక్షపై విమర్శలు

చంద్రబాబు, భువనేశ్వరి ఏదో త్యాగం చేసినట్లు నిరశన దీక్ష చేస్తున్నారని మంత్రి రోజా విమర్శించారు. ఎన్టీఆర్ నుంచి ముద్రగడ పద్మనాభం వరకు...చంద్రబాబు జీవితమే హింసా మార్గం, వేధింపుల సంస్కృతి అని ఆరోపించారు. చంద్రబాబు దొంగ దీక్ష చేస్తున్నారని, దానిని ప్రజలెవరూ పట్టించుకోవడం లేదన్నారు. వైసీపీకి 15 సీట్లు కూడా రావని పవన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. వైసీపీకీ 15 సీట్లు రావడం కాదు, పవన్ కు 15 సీట్లలో కనీసం అభ్యర్థులు ఉన్నారా? అని ప్రశ్నించారు. వైసీపీకి 175 స్థానాల్లో అభ్యర్థులు ఉన్నారని తెలిపారు. ఏపీలో మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బండారు సత్యనారాయణ ఇంటి వద్ద ఉద్రిక్తత

అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలోని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి వద్ద ఆదివారం అర్ధరాత్రి నుంచి భారీగా పోలీసులు మోహరించారు. మంత్రి రోజాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో వెన్నెలపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బండారు సత్యనారాయణ సతీమణి మాధవీలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎటువంటి నోటీసులు లేకుండా నిన్న రాత్రి నుంచి పోలీసులు తమను గృహ నిర్బంధం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డీఎస్పీ సత్యనారాయణ, పోలీసులు తమను భయాందోళనలకు గురిచేశారని ఆరోపించారు. మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాశారు. పలువురు వైసీపీ నేతలు గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో బండారుపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బండారు సత్యనారాయణపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది.

Whats_app_banner