Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు-td has cancelled the vip break darshan on october 31 following deepavali asthanam in tirumala ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 30, 2024 10:59 AM IST

దీపావళి పండగ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు ‘దీపావళి ఆస్థానాన్ని’ నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసింది. మరోవైపు బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.

తిరుమలలో వీఐపీ దర్శనం రద్దు
తిరుమలలో వీఐపీ దర్శనం రద్దు

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. దీపావళి పండుగ సందర్భంగా రేపు ‘దీపావళి ఆస్థానాన్ని’ నిర్వహించనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన చేసింది. ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుందని వివరించింది.

ఆస్థానంలో భాగంగా శ్రీ మలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటు చేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది.

సాయంత్రం 5 గంట‌లకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు సహస్ర దీపాలంకరణ ‌సేవ‌లో పాల్గొని, ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో విహరించి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు.

వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు:

తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు దీపావళి ఆస్థానం సందర్భంగా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇందుకు సంబంధించి 30వ తేదీ తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.

తిరుమలలో విశేష పర్వదినాలు :

తిరుమలలో నవంబరు నెలలో జరుగనున్న విశేష పర్వదినాలను టీటీడీ వెల్లడించింది. ఆ వివరాలు ఇవిగో…

•⁠ ⁠నవంబరు 1న కేదారగౌరీ వ్రతం

•⁠ ⁠నవంబరు 3న భగినీహస్త భోజనం, శ్రీ తిరుమలనంబి శాత్తుమొర

•⁠ ⁠నవంబరు 5న నాగుల చవితి, పెద్ద శే ష వాహనం.

•⁠ ⁠నవంబరు 6న శ్రీ మనవాళ మహామునుల శాత్తుమొర

•⁠ ⁠నవంబరు 8న వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ

•⁠ ⁠నవంబరు 9న శ్రీ వారి పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం, పిళ్లైలోకాచార్య వర్ష తిరు నక్షత్రం, పోయిగైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, పూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, వేదాంత దేశికుల శాత్తుమొర

•⁠ ⁠10న పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం

•⁠ ⁠నవంబరు 11న శ్రీ యాజ్ఞవల్క్య జయంతి

•⁠ ⁠నవంబరు 12న ప్రబోధన ఏకాదశి

•⁠ ⁠నవంబరు 13న కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస్య వ్రత సమాప్తి

•⁠ ⁠నవంబరు 15న కార్తీక పౌర్ణమి

•⁠ ⁠28న ధన్వంతరి జయంతి

•⁠ ⁠29న మాస శివరాత్రి

Whats_app_banner