తెలుగు న్యూస్ / ఫోటో /
TTD Brahmotsavam 2024 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు... అశ్వవాహనంపై మలయప్పస్వామి దర్శనం - ఫొటోలు
- Tirumala Brahmotsavam 2024 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం రాత్రి అశ్వవాహనంపై శ్రీమలయప్పస్వామి విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఈ వేడుకలో భక్తులు భారీగా పాల్గొన్నారు. చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

(1 / 6)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం రాత్రి అశ్వవాహనంపై శ్రీమలయప్పస్వామి విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
(2 / 6)
వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్లు వేదమంత్రాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
(3 / 6)
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది.
(4 / 6)
అశ్వవాహనంతో శ్రీవారికి వాహన సేవలు ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో 14 వాహనాలపై శ్రీవారు దర్శనమిచ్చారు.
(5 / 6)
బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు స్వామిపుష్కరిణిలో స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తారు. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది.
ఇతర గ్యాలరీలు