Nellore Police : నెల్లూరు జిల్లాలో రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్- డీఎస్పీ, సీఐని కారుతో ఢీకొట్టి పరారీ!-nellore ganja smuggler hits dsp ci at toll plaza to escape from police checking ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nellore Police : నెల్లూరు జిల్లాలో రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్- డీఎస్పీ, సీఐని కారుతో ఢీకొట్టి పరారీ!

Nellore Police : నెల్లూరు జిల్లాలో రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్- డీఎస్పీ, సీఐని కారుతో ఢీకొట్టి పరారీ!

Bandaru Satyaprasad HT Telugu
Aug 24, 2024 04:25 PM IST

Nellore Police : నెల్లూరు జిల్లాలో టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తున్న డీఎస్పీ, సీఐను దుండగుడు కారుతో ఢీకొట్టాడు. అనుమానంతో కారును ఆపుతుండగా...వేగం పెంచి పోలీసులపైకి దూసుకెళ్లాడు. ఈ దాడిలో నెల్లూరు గ్రామీణ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, వాకాడు సీఐ హుస్సేన్‌బాషా గాయపడ్డారు.

రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్- డీఎస్పీ, సీఐని కారుతో ఢీకొట్టి పరారీ!
రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్- డీఎస్పీ, సీఐని కారుతో ఢీకొట్టి పరారీ!

Nellore Police : నెల్లూరు జిల్లా వెంకటాచలం, గూడూరు టోల్ గేట్ వద్ద తనిఖీలు చేస్తున్న డీఎస్పీ, సీఐని దుండగుడు కారుతో ఢీకొట్టాడు. తనిఖీల్లో ఓ కారును ఆపుతుండగా...వేగం పెంచిన దుండగుడు పోలీసులను ఢీకొట్టాడు. ఈ కారులో గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారం రాత్రి గూడూరు సాదుపేటలో టోల్‌ గేట్‌ వద్ద వాకాడు సీఐని కారును ఆపేందుకు ప్రయత్నించడగా...కారు వేగంగా పోనిచ్చి సీఐ హుస్సేన్‌బాషాను ఢీకొట్టారు. అంతకు ముందు వెంకటాచలం వద్ద డీఎస్పీ శ్రీనివాసరావు కారుతో ఢీకొట్టారు.

అసలేం జరిగింది?

నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్‌ ప్లాజా వద్ద శుక్రవారం అర్ధరాత్రి..నెల్లూరు గ్రామీణ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు వాహన సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో నెల్లూరు నుంచి చెన్నై వెళ్తున్న ఓ కారును పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. దుండగులు కారుతో డీఎస్పీ శ్రీనివాసరావు ఢీకొట్టి పరారయ్యారు. ఈ ఘటన సమాచారం అందుతున్న వాకాడు సీఐ గూడూరు సాదుపేటలో టోల్ గేట్ వద్ద కారును అడ్డుకోబోయారు. డ్రైవర్ కారుతో సీఐని ఢీకొట్టాడు. ఈ దాడిలో గాయపడిన డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ హుస్సేన్ బాషాను నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గంజాయి స్మగ్లర్ అరెస్ట్?

ఈ ఘటనతో అలర్ట్ అయిన పోలీసులు టోల్ ప్లాజాల వద్ద నిఘా పెట్టారు. శనివారం ఉదయం కారును జిల్లా సరిహద్దు ప్రాంతమైన మర్రిపాడు వద్ద పోలీసులు పట్టుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టుబడిన కారులో మాదక ద్రవ్యాలు ఉన్నాయా? లేదా? అనే విషయంపై పోలీసులు ఇంకా ఏ ప్రకటన చేయలేదు. ఈ దాడిపై ఎస్పీ కృష్ణకాంత్‌ ఆరా తీశారు. అయితే ఓ గంజాయి స్మగ్లర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

డీఎస్పీని పరామర్శించిన సోమిరెడ్డి

నెల్లూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎస్పీ శ్రీనివాసరావు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి పరామర్శించారు. గంజాయి, డ్రగ్స్‌ అక్రమ రవాణాను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు. పోలీసులను కారుతో ఢీకొట్టి హత్యాయత్నానికి పాల్పడటం దారుణమన్నారు. డీఎస్పీని ఢీకొట్టిన గంజాయి ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత కథనం