Andhra Pradesh News Live August 24, 2024: Atchutapuram incident: వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. అచ్యుతాపురం బాధితులకు సాయం-today andhra pradesh news latest updates august 24 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live August 24, 2024: Atchutapuram Incident: వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. అచ్యుతాపురం బాధితులకు సాయం

Atchutapuram incident: వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. అచ్యుతాపురం బాధితులకు సాయం

Andhra Pradesh News Live August 24, 2024: Atchutapuram incident: వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. అచ్యుతాపురం బాధితులకు సాయం

12:20 PM ISTAug 24, 2024 05:50 PM HT Telugu Desk
  • Share on Facebook
12:20 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 24 Aug 202412:20 PM IST

Andhra Pradesh News Live: Atchutapuram incident: వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. అచ్యుతాపురం బాధితులకు సాయం

  • Atchutapuram incident: అచ్యుతాపురం ప్రమాదంలో గాయపడిన వారికి అండగా నిలవాలని మాజీ సీఎం జగన్ నిర్ణయించారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు పార్టీ తరఫున సాయం చేయనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వారికి పరిహారం ప్రకటించింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 24 Aug 202410:54 AM IST

Andhra Pradesh News Live: Nellore Police : నెల్లూరు జిల్లాలో రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్- డీఎస్పీ, సీఐని కారుతో ఢీకొట్టి పరారీ!

  • Nellore Police : నెల్లూరు జిల్లాలో టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తున్న డీఎస్పీ, సీఐను దుండగుడు కారుతో ఢీకొట్టాడు. అనుమానంతో కారును ఆపుతుండగా...వేగం పెంచి పోలీసులపైకి దూసుకెళ్లాడు. ఈ దాడిలో నెల్లూరు గ్రామీణ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, వాకాడు సీఐ హుస్సేన్‌బాషా గాయపడ్డారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 24 Aug 202410:39 AM IST

Andhra Pradesh News Live: AP weather alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం.. ఈ జిల్లాలకు అలెర్ట్

  • AP weather alert: ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 24 Aug 202409:26 AM IST

Andhra Pradesh News Live: Bapatla Kendriya Vidyalaya: బాపట్ల కేంద్రీ విద్యాలయ సైన్స్ ల్యాబ్ లో ప్రమాదం, 24 మంది విద్యార్థులకు అస్వస్థత

  • Bapatla Kendriya Vidyalaya : బాపట్ల కేంద్రీయ విద్యాలయలో శనివారం ప్రమాదం జరిగింది. సైన్స్ ల్యాబ్ లో రసాయన వాయువులు విడుదలయ్యాయి. ఈ ఘటనలో వాయువులు పీల్చి 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 24 Aug 202409:16 AM IST

Andhra Pradesh News Live: JNTU Anantapur: జేఎన్‌టీయూ నుంచి పీహెచ్‌డీ నోటీఫికేష‌న్.. సెప్టెంబర్ 4 వరకే గడువు

  • JNTU Anantapur: అనంత‌పురంలోని జ‌వ‌హ‌ర్‌ లాల్ నెహ్రూ టెక్నాల‌జీక‌ల్ యూనివ‌ర్శిటీ (జేఎన్‌టీయూ-ఏ) పీహెచ్‌డీ నోటీఫికేష‌న్ విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు సెప్టెంబ‌ర్ 4న వరకు అవకాశం ఇచ్చింది. ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోవాలని సూచించింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 24 Aug 202408:53 AM IST

Andhra Pradesh News Live: Tirupati: ఆరు నెలల కిందట చెల్లితో.. ఇప్పుడు అక్కతో.. అంతలోనే ఊహించని ట్విస్ట్!

  • Tirupati: రోజురోజుకూ మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. కొందరు యువతీ యువకులు వాయివరస లేకుండా ప్రవర్తిస్తున్నారు. కన్నవారికి చెడ్డపేరు తీసుకొస్తున్నారు. తాజాగా తిరుపతి జిల్లాలో సభ్య సమాజం తలదించుకొనే ఘటన వెలుగులోకి వచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 24 Aug 202408:09 AM IST

Andhra Pradesh News Live: AP Secretariat Employees : గ్రామ, వార్డు స‌చివాలయ ఉద్యోగుల బ‌దిలీల‌కు షెడ్యూల్‌ విడుదల - మార్గ‌ద‌ర్శ‌కాలివే

  • రాష్ట్రంలోని గ్రామ, వార్డు స‌చివాలయ ఉద్యోగుల బ‌దిలీల‌కు షెడ్యూల్‌ విడుదలైంది. ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌లపై ప్రభుత్వం మార్గదర్శకాలు, సూచనలను చేసింది. ఈ మేరకు ప్రభుత్వం సర్కూల‌ర్ ను జారీ చేసింది. కౌన్సెలింగ్‌కు తీసుకురావాల్సిన స‌ర్టిఫికెట్లపై కూడా క్లారిటీ ఇచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 24 Aug 202402:33 AM IST

Andhra Pradesh News Live: Srikalahasti : మైనర్ బాలికపై సామూహిక‌ అత్యాచారం..! గర్భం దాల్చటంతో బయటపడిన అసలు విషయం

  • శ్రీకాళ‌హ‌స్తిలో దారుణం వెలుగు చూసింది. తల్లిదండ్రులు లేని మైన‌ర్ బాలిక‌పై న‌లుగురు సామూహిక‌ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే బాలిక గ‌ర్భ‌వ‌తి కావటంతో వారంతా పరారయ్యారు. గ్రామ పెద్దలు రంగంలోకి దిగి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. అయితే విషయం బయటికి రావటంతో బాలిక అమ్మమ్మ పోలీసులను ఆశ్రయించింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 24 Aug 202402:00 AM IST

Andhra Pradesh News Live: Tirumala Darshan Tickets : నేడు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల - ఇలా బుకింగ్ చేసుకోవచ్చు..!

  • నేడు ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి నవంబర్‌ నెల దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి వీటిని బుకింగ్ చేసుకోవచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 24 Aug 202401:41 AM IST

Andhra Pradesh News Live: YSRCP : వైసీపీలో మార్పులు.. చేర్పులు..! పార్టీ ప్రక్షాళన దిశగా జగన్ అడుగులు

  • పార్టీ బలోపేతంపై వైసీపీ అధినేత జగన్ దృష్టి సారించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలతో డీలా పడిపోయిన నేపథ్యంలో… పార్టీ అనుబంధ విభాగాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. తాజాగా 15 విభాగాలకు కొత్త అధ్యక్షలను ప్రకటించారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 24 Aug 202401:07 AM IST

Andhra Pradesh News Live: AP Govt Jobs : ఏపీ వైద్యారోగ్యశాఖ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ - 488 పోస్టుల భర్తీకి ప్రకటన, వివరాలివే

  • DME AP Recruitment 2024 : ఏపీలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుడుదలైంది. మొత్తం 488 ఉద్యోగాలను రిక్రూట్ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబరు 9వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. 
పూర్తి స్టోరీ చదవండి