AP Weather Updates: రాయలసీమ వరకు విస్తరించిన ఆవర్తనం, రాష్ట్రమంతటా విస్తరిస్తున్న రుతుపవనాలు-monsoons extending over rayalaseema and extending across the state ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Weather Updates: రాయలసీమ వరకు విస్తరించిన ఆవర్తనం, రాష్ట్రమంతటా విస్తరిస్తున్న రుతుపవనాలు

AP Weather Updates: రాయలసీమ వరకు విస్తరించిన ఆవర్తనం, రాష్ట్రమంతటా విస్తరిస్తున్న రుతుపవనాలు

Sarath chandra.B HT Telugu
Jun 07, 2024 06:57 AM IST

AP Weather Updates: నైరుతి రుతుపవనాల విస్తరణతో రాష్ట్రమంతటా సాధారణ వర్షపాతం నమోదు అవుతోంది. ఉత్తరాంధ్ర, ఏలూరు, ఎన్టీఆర్‌, పల్నాడు, గుంటూరు, తూర్పు గోదావరిలో కొన్ని ప్రాంతాల్లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతోంది.

రాష్ట్ర మంతటా చురుగ్గా విస్తరిస్తున్న రుతుపవనాలు
రాష్ట్ర మంతటా చురుగ్గా విస్తరిస్తున్న రుతుపవనాలు

AP Weather Updates: ఆంధ్రప్రదేశ‌‌ అంతట రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలతో పాటు, కర్ణాటకలోని మిగిలిన భాగాలు, దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ & ఉత్తరాంధ్ర మరికొన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రాయలసీమ మరియ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం విస్తరించి ఉందన్నారు. రుతుపవనాల ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో గత రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదు అవుతోంది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

శుక్రవారం ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల మరియు పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు.

శనివారం అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

గురువారం సాయంత్రం 5 గంటల నాటికి శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువులో 44మిమీ, నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 40మిమీ, శ్రీసత్యసాయి జిల్లా నంబులపూలకుంటలో 39మిమీ, నెల్లూరు జిల్లా సైదాపురంలో 39మిమీ, పార్వతీపురంమన్యం జిల్లా సాలూరులో 36.7మిమీ, తిరుపతి జిల్లా పుత్తూరులో 30మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది.

Whats_app_banner