AP Ration Prices: ఏపీలో కిలో కందిపప్పు రూ.67... అర కిలో పంచదార రూ.17, రేషన్‌ దుకాణాల్లో విక్రయాలు-kg sugar for rs 67 half a kilo of sugar is rs 17 sales in ration shops ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ration Prices: ఏపీలో కిలో కందిపప్పు రూ.67... అర కిలో పంచదార రూ.17, రేషన్‌ దుకాణాల్లో విక్రయాలు

AP Ration Prices: ఏపీలో కిలో కందిపప్పు రూ.67... అర కిలో పంచదార రూ.17, రేషన్‌ దుకాణాల్లో విక్రయాలు

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 02, 2024 07:15 AM IST

AP Ration Prices: సబ్సిడీ ధరలకే ఆంధ్రప్రదేశ్‌ చౌక ధరల దుకాణాల్లో కందిపప్పు, పంచదార విక్రయాలను ప్రారంభించారు. కందిపప్పు కిలో రూ.67కు, పంచదారను అరకిలో రూ.17కే విక్రయిస్తున్నారు. తాజా నిర్ణయంతో కోటిన్నర మంది రేషన్‌ కార్డుదారులకు లబ్ది చేకూరనుంది.

రేషన్ దుకాణాల్లో రూ.67కే కిలో కందిపప్పు, రూ.17కే పంచదార
రేషన్ దుకాణాల్లో రూ.67కే కిలో కందిపప్పు, రూ.17కే పంచదార

AP Ration Prices: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డు దారులకు నిత్యావసర వస్తువుల ధరలను సబ్సిడీ ధరలకే అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులందరికీ కంది పప్పు, పంచదారను తక్కు ధరకే పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కందిపప్పు కిలో రూ.67కు, పంచదార అర కిలో 17కు అందిస్తారు.

సబ్సిడీ ధరలతో రేషన్‌ పంపిణీ ద్వారా రాష్ట్రంలోని 1,48,43,671 మంది రేషన్ కార్డు దారులకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా కందిపప్పు, పంచదార కూడా రేషన్ బియ్యంతో పాటు కార్డుదారులకు అందిస్తారు.

మార్కెట్‌లో కిలో రూ.163 ధర ఉన్న కందిపప్పును రేషన్ కార్డుదారులకు రూ.67కి అందిస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ప్రతి కిలోకు రూ.96 సబ్సిడీ చెల్లిస్తున్నట్టు తెలిపారు.

ప్రజలకు నిత్యవసర సరుకులు అందుబాటు ధరల్లో ఉంచేలా చూడాలని పౌర సరఫరాల శాఖకు దిశానిర్దేశం చేసినట్టు వివరించారు. ఈ క్రమంలో రెండుమార్లు బియ్యం, కందిపప్పు ధరలు తగ్గించేలా చూశామని, రైతు బజార్లు, పెద్ద సంస్థాగత రిటైల్ దుకాణాల్లో కిలో కందిపప్పు దేశవాళీ రకం రూ.150కి, బియ్యం (స్టీమ్డ్ – బీపీటీ/సోనా మసూరి) రూ.48, బియ్యం (పచ్చి – బీపీటీ/సోనా మసూరి) రూ.47కి విక్రయిస్తున్నట్టు తెలిపారు.

తాజాగా రేషన్ కార్డుదారులకు కందిపప్పు, పంచదార కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇటీవల వరదల సమయంలో బాధితులకు బియ్యం 25 కేజీలు, నూనె 1 లీటరు, పంచదార 1 కేజీ, కందిపప్పు 1 కేజీ, ఉల్లిపాయలు 2 కేజీలు, ఆలుగడ్డ 2 కేజీలు అందించామని చెప్పారు.