Kesineni Nani: భూ మాఫియా కోసమే అమరావతి అంటోన్న కేశినేని నాని-kesineni nani accused amaravati for land mafia purposes ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kesineni Nani: భూ మాఫియా కోసమే అమరావతి అంటోన్న కేశినేని నాని

Kesineni Nani: భూ మాఫియా కోసమే అమరావతి అంటోన్న కేశినేని నాని

Sarath chandra.B HT Telugu
Jan 12, 2024 02:04 PM IST

Kesineni Nani: అమరావతిలో రాజధాని నిర్మాణం భూ మాఫియా ప్రయోజనాల కోసమేనని ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. అవమానకరమైన రీతిలో టీడీపీ నుంచి తనను గెంటేశారని మండిపడ్డారు.

కేశినేని నాని
కేశినేని నాని

Kesineni Nani: రాజధాని భూముల విషయంలో చంద్రబాబు అమరావతి రైతుల్ని మోసం చేశాడని ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను అమరావతి రైతులకు కూడా చెప్పానన్నారు. పార్టీలో చేరిన సమయంలో విజయవాడ అభివృద్ధి విషయంలో తనది బాధ్యత అని జగన్ హామీ ఇచ్చాడని కేశినేని నాని చెప్పారు. చంద్రబాబు విజయవాడతో పాటు విజయవాడ పార్లమెంటు పరిధిలో అన్ని ప్రాంతాలను ముంచేశారని ఆరోపించారు.

ఐదేళ్లలో విజయవాడ నగరానికి చంద్రబాబు కనీసం 100కోట్లు కూడా ఇవ్వలేదని, పుష్కరాల్లో చేసిన ఖర్చు తప్ప ఇంకేమి చేయలేదని ఆరోపించారు. విజయవాడ-గుంటూరు ప్రాంతాల మధ్య రాజధాని నిర్మాణం చేపట్టి ఉంటే ఈపాటికి గణనీయమైన పురోగతి సాధించేదన్నారు.

ప్రపంచంలో నగరాల్ని నిర్మించిన దాఖలాలు ఎక్కడా లేవని, భూమాఫియా ప్రయోజనాలను కాపాడటం కోసమే అమరావతి పేరుతో రైతుల్ని వంచించారన్నారు. విజయవాడ-గుంటూరు నగరాలకు చంద్రబాబు చేసిందేమిటని నిలదీశారు.

అమరావతి శంకుస్థాపన సమయంలో దాని నిర్మాణం సాధ్యం కాదని ఇతర ఎంపీలకు తాను చెప్పానన్నారు. 30ఏళ్లైనా అమరావతి నిర్మాణం పూర్తి కాదని ఆచరణ సాధ్యం కాని పనులు చంద్రబాబు చేపట్టారని ఆరోపించారు. భారీ నగరాల నిర్మాణం ప్రపంచంలో ఎవరు చేయలేదని చంద్రబాబు మాత్రమే అలాంటి పనులతో ప్రజల్ని మోసం చేశాడని మండిపడ్డారు.

సెక్రటేరియట్‌‌కు తాను ఒకటి రెండుసార్లు తప్ప వెళ్లాల్సిన అవసరం లేదని, అమరావతి పేరుతో విజయవాడ ప్రాంతానికి ద్రోహం చేయడం తప్ప ఏమి చేయలేదన్నారు. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయడం తప్ప మరో అజెండా చంద్రబాబుకు లేదన్నారు. అందుకే పవన్‌ కళ్యాణ్‌నును కూడా వాడుకున్నారని ఆరోపించారు.

చంద్రబాబు నాయుడు గురించి ఎవరిని అడిగినా చెబుతారని మోసం చేయడం బాబు నైజం అన్నారు. తిరువూరులో నల్లగట్ల స్వామిదాసు పార్టీలో చేరిన విషయంలో తన ప్రమేయం లేదని కేశినేని నాని స్పష్టం చేశారు. తాను చేరడానికి ముందే స్వామిదాసుతో పార్టీ సంప్రదింపులు చేస్తోందన్నారు. టీడీపీ నుంచి తాను ఎవరిని వైసీపీలోకి ఆహ్వానించలేదన్నారు.

Whats_app_banner