IRCTC Simhachalam Tour 2024 : ‘వైజాగ్, సింహాచలం ట్రిప్.. తక్కువ ధరలోనే 2 రోజుల ప్యాకేజీ, ఇలా బుక్ చేసుకోవచ్చు
IRCTC Simhachalam Tour Latest: సింహాచలం వెళ్లాలనుకుంటున్నారా…? అయితే మీకోసం ఐఆర్‌సీటీసీ 'వైజాగ్ బ్లిస్' ప్యాకేజీని అందిస్తోంది. ఆ వివరాలను ఇక్కడ చూడండి….
IRCTC Simhachalam Tourism Package 2024: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఈ కొత్త ఏడాదిలో వైజాగ్ ప్రాంతంలోని సింహాచలం వెళ్లాలనుకునే వారికి సరికొత్త ప్యాకేజీ ఇస్తోంది. అది కూడా వీకెండ్ లో ఆపరేట్ చేస్తోంది. 'వైజాగ్ బ్లిస్(VIZAG BLISS' పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో భాగంగా సింహాచలంతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి. ఇది 2 రోజులు, ఒక నైట్ ప్యాకేజీ. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ… మార్చి 05,2024వ తేదీన అందుబాటులో ఉంది.
షెడ్యూల్ చూస్తే...
Day 01: ఈ ప్యాకేజీ విశాఖ నుంచి స్టార్ట్ అవుతుంది. విశాఖలోని హోటల్ కి వెళ్లి చెకిన్ అవుతారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత.. తొట్లకొండ బుద్దిస్ట్ కాంప్లెక్స్ కు వెళ్తారు. సోమవారం టూర్ వెళ్లే వారు మాత్రం.. రామనాయాడు ఫిల్మ్ స్టూడియో కూడా చూస్తారు. అనంతరం రిషికొండ బీచ్, కైలాస్ గిరి వెళ్తారు. ఫిషింగ్ హార్బర్ లో బోటింగ్ కూడా ఉంటుంది. తిరిగి హోటల్ కు వస్తారు. రాత్రి బోజనం తర్వాత... విశాఖలోనే బస చేస్తారు.
DAY 02: ఇక రెండోరోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత... హోటల్ నుంచి చెక్ అవుట్ అయితారు. సింహాచలం వెళ్తారు. దర్శనం తర్వాత విశాఖపట్నం వస్తారు. దీంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
టికెట్ ధరల వివరాలు..
విశాఖ - సింహాచలం టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే….. సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ. 10,535గా ఉంది. డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ. 5,895, ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.4555గా నిర్ణయించారు. చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ తో పాటు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
అరకు టూర్…
IRCTC Visakhapatnam Araku Tour 2024: ఈ ఏడాదిలో టూర్ కు వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం వేర్వురు ప్రదేశాలను చూసేందుకు ఆఫర్లతో కూడిన కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా అరకు(Araku Tour 2024) అందాలను చూసేందుకు 3 రోజుల టూర్ ప్యాకేజీని(IRCTC) తీసుకొచ్చింది. 'VIZAG - ARAKU HOLIDAY PACKAGE ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. విశాఖ నుంచే ఈ టూర్ అందుబాటులో ఉంది.
తొలిరోజు విశాఖ సిటీ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. విశాఖలని తొట్లకొండ బుద్దిస్ట్ కాంప్లెక్స్, కైలాసగిరి, రుషికొండ బీచ్ లను సందర్శిస్తారు. రాత్రి విశాఖలోనే బస చేస్తారు.
రెండో రోజు 8 గంటలకు అరకుకు వెళ్తారు. టన్నెల్స్, బ్రిడ్జిలపై నుంచి వెళ్తున్న సమయంలో ప్రయాణికులు సరికొత్త అనుభూతిని పొందుతారు. అరకు వ్యాలీకి చేరుకున్న తర్వాత... బస్సులో ప్రయాణం ఉంటుంది. ఇక్కడ ఉన్న ట్రైబల్ మ్యూజియంతో పాటు గార్డెన్స్ ను సందర్శిస్తారు. వచ్చే క్రమంలో అనంతగిరి కాఫీ ప్లాన్ టేషన్, గాలికొండ వ్యూ పాయింట్ కు వెళ్తారు. అనంతరం విశాఖకు వచ్చే మార్గంలో సబ్ మెరైన్ మ్యూజియంను సందర్శిస్తారు. ఆ తర్వాత సిటీకి చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
Visakhapatnam Araku Tour Cost: ఈ టూర్ ప్యాకేజీ చూస్తే... కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 17,715 గా నిర్ణయించారు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 10,100, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 7980గా నిర్ణయించారు. చిన్న పిల్లలకు ఎక్స్ ట్రా బెడ్ తో కలిపి రూ. 5915గా ఉంది. వెళ్లే కోచ్ ను బట్టి ధరలు మారుతాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.