Tirupati : సహచర విద్యార్థినిపై దారుణం - మత్తులోకి దించి అత్యాచారం, ఆపై వీడియోలతో బెదిరింపులు...! దంపతులు అరెస్ట్
Tirupati Crime News: మత్తులోకి దించి సహచర విద్యార్థిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో భర్తకు భార్య సహకరించటంతో పాటు వీడియోలు, ఫొటోలు తీసి డబ్బుల కోసం బెదిరించారు. ఎట్టకేలకు బాధితురాలు తిరుపతి రూరల్ పోలీసులను ఆశ్రయించగా… దంపతులిద్దరూ అరెస్ట్ అయ్యారు.
Tirupati Crime News: తిరుపతి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. సహచరి విద్యార్థినిపై మరో విద్యార్థిని దారుణానికి ఒడిగట్టింది. గంజాయి మత్తులోకి దించగా.. సహచర విద్యార్థినిపై భర్త అత్యాచారాానికి పాల్పడ్డాడు. ఈ తతంగాన్ని రికార్డు చేసి సదరు యువతిని బెదిరించారు. డబ్బులు కోసం వేధించటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న తిరుపతి రూరల్ పోలీసులు భార్య భర్తలను అరెస్ట్ చేశారు.
ఏం జరిగిందంటే…?
తిరుపతి రూరల్ పోలీసుల వివరాల ప్రకారం…. కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన ఓ యువతి తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరింది. ఇదే సమయంలో తిరుపతి గ్రామీణ మండల పరిధిలో నివాసం ఉంటున్న సహచర విద్యార్థిని సదాశివం ప్రణవకృష్ణ (35)తో స్నేహం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో సదరు యువతి… ప్రణవకృష్ణ ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలో ప్రణవకృష్ణ భర్త కృష్ణకిషోర్‌రెడ్డితో కూడా పరిచయ ఏర్పడింది. అయితే భార్య భర్తలు ఇద్దరూ గంజాయికి అలవాటు అయ్యారు. అయితే వీరికి ఇంటికి వచ్చే యువతిని కూడా ట్రాప్ లో పడేశారు. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇవ్వటంతో యువతి మైకంలో దిగిపోయేది. ఆపై ప్రణవకృష్ణ భర్త… యువతిపై అత్యాచారానికి పాల్పడేవాడు. అయితే ఈ తతంగాన్ని భార్యే… రికార్డు చేసే పనిలో ఉండేది.
అయితే ఈ వీడియోలు చూపించి ఆ యువతిని బెదిరించి నగదు, నగలు తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవలే ఈ వీడియోలను యువతి అన్నతో పాటు ఆమెకు కాబోయే భర్తకు కూడా పంపి డబ్బులను డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
భార్య భర్తలిద్దరి వేధింపులు తట్టుకోేలేక సదరు యువతి… తిరుపతి రూరల్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. జులై 26వ తేదీ మధ్యాహ్నం సమయంలో చేర్లోపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్ కు తరలించారు.
ఈ కేసులో సదాశివం ప్రణవ్ క్రిష్ణ(34) ఏ1గా ఉండగా… భర్త వెంకిరెడ్డి క్రిష్ణకిషోర్ రెడ్డి(35) ఏ2గా ఉన్నట్లు తిరుపతి రూరల్ సీఐ తమీం అహ్మద్ వెల్లడించారు.