Tadepalle : జగన్ ఇంటి దగ్గర టెన్షన్.. టెన్షన్.. జై శ్రీరామ్ అంటూ నినాదాలు-hindus chanting jai shri ram near jagan house in tadepalle ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tadepalle : జగన్ ఇంటి దగ్గర టెన్షన్.. టెన్షన్.. జై శ్రీరామ్ అంటూ నినాదాలు

Tadepalle : జగన్ ఇంటి దగ్గర టెన్షన్.. టెన్షన్.. జై శ్రీరామ్ అంటూ నినాదాలు

Basani Shiva Kumar HT Telugu
Sep 22, 2024 12:49 PM IST

Tadepalle : ఏపీలో తిరుమల లడ్డూ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఇష్యూపై ఇప్పటికే టీడీపీ, వైసీపీ మధ్య పొలిటికల్ వార్ జరుగుతుండగా.. తాజాగా హిందు సంఘాలు ఎంటర్ అయ్యాయి. మాజీ సీఎం జగన్ ఇంటి దగ్గర కొందరు హిందువులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

జగన్ ఇంటి దగ్గర జై శ్రీరామ్ నినాదాలు
జగన్ ఇంటి దగ్గర జై శ్రీరామ్ నినాదాలు

తాడేపల్లిలో జగన్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. కొందరురు హిందువులు జగన్ ఇంటి దగ్గరకు చేరుకొని.. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటికే తిరుమల లడ్డూ అంశంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఈ నేపథ్యం లో ఈ ఘటన టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది.

తిరుమల లడ్డూ ఇష్యూపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. 'కలియుగ ప్రత్యక్ష దైవం, వెంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో.. శ్రీవారికి ప్రీతిపాత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతోపాటు.. కల్తీ అయిన నెయ్యిని, చేప నూనెను వినియోగించారని కథనాలు వస్తున్నాయి. ఈ వార్తలు శ్రీవారి భక్త కోటిని, యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను తీవ్రంగా కలిచి వేస్తోంది' అని సంజయ్ లేఖ లో ప్రస్తావించారు.

'లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వినియోగించడం అత్యంత నీచం. ఒకవేళ అదే నిజమైతే హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర జరిగినట్లుగానే అనుమానిస్తున్నాం. లడ్డూ ప్రాముఖ్యతను తగ్గించడానికి, టీటీడీ పై కోట్లాది మంది భక్తులకు ఉన్న విశ్వాసాన్ని సడలించేందుకు ఈ కుట్ర చేసినట్లుగా భావిస్తున్నాం' అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

'రాజకీయ ప్రయోజనాలను పూర్తిగా పక్కనపెట్టి.. ప్రపంచంలోని యావత్ హిందువుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉంది. తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించాలని, దోషులుగా తేలిన వారు ఎంతటి వారైనా, ఏ పార్టీ వారైనా సరే చట్ట ప్రకారం శిక్ష పడేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా' అని సంజయ్ లేఖ రాశారు.

తిరుమలలో జరిగిన విధంగా ఏ ధర్మంపై దాడి జరిగిన సరే గ్లోబల్ వార్త అవుతుందని, ప్రపంచం అల్లకల్లోలం అవుతుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు ప్రసాదం అపవిత్రం అవుతుంటే మాత్రం ఎవరు మాట్లడకూడదా..? అని ప్రశ్నించారు. "మీరు సెక్యులర్ మాట్లాడకూడదు అంటే ఎలా? హిందువులకు మనోభావాలు ఉండవా? హిందువులపై దాడి జరిగితే చూస్తూ కూర్చోవాలా ?' అని కామెంట్స్ చేశారు.

తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో.. రాష్ట్రంలోని అన్ని ఆలయాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సింహాచలం కొండపై ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదం తయారీ లో నాణ్యత లేని నెయ్యి వినియోగిస్తున్నారని.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేశారు.

'విశాఖ డెయిరీ, అమూల్ కిలో నెయ్యి ధర సుమారు రూ.650 నుంచి 700 ఉంది. నాణ్యమైన నెయ్యి కిలోకు రూ.1,000 కంటే ఎక్కువ ధర ఉంటుంది. కేవలం రూ.385కి సరఫరా అవుతున్న నెయ్యిని మీరు ఎలా అంగీకరించగలరు?' అని దేవస్థానం సిబ్బందిని గంటా శ్రీనివాస రావు ప్రశ్నించారు. ఎమ్మెల్యే వెంట వచ్చిన ఫుడ్‌ సేఫ్టీ అధికారులు.. వివిధ రకాల పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు.

Whats_app_banner