Global Investors Summit 2023 : విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు-global investors summit 2023 in visakhapatnam here s logo ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Global Investors Summit 2023 In Visakhapatnam Here's Logo

Global Investors Summit 2023 : విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు

HT Telugu Desk HT Telugu
Nov 08, 2022 03:46 PM IST

Visakhapatnam Global Investors Summit 2023 : విశాఖపట్నంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2023 జరగనుంది. దీనికి సంబంధించిన లోగోను క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఆవిష్కరించారు.

లోగో ఆవిష్కరించిన సీఎం జగన్
లోగో ఆవిష్కరించిన సీఎం జగన్

2023 మార్చిలో ఏపీలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్(Global Investors Summit 2023) జరగనుంది. లోగోను సీఎం జగన్(CM Jagan)తోపాటుగా పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాత్, అధికారులు ఆవిష్కరించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సును విశాఖపట్నంలో నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు. మూడేళ్ల నుంచి రాష్ట్రంలో ఇన్వెస్ట్ మెంట్ సదస్సులు నిర్వహించలేదన్నారు.

ట్రెండింగ్ వార్తలు

గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సదస్సును విశాఖపట్నం(Visakhapatnam)లో నిర్వహించాలని సీఎం జగన్ చెప్పారని మంత్రి అమర్ నాథ్ అన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆహ్వానించి ఈ సదస్సును నిర్వహించనున్నట్టుగా చెప్పారు. మూడేళ్ల కాలంలో కరోనా(Corona పరిస్థితుల కారణంగా సదస్సులు నిర్వహణ జరగలేదన్నారు. ఇప్పుడు పరిస్థితులు సద్దుమణిగాయని.. వాటిని దాటుకుని ముందుకు అడుగులు వేస్తున్నామన్నారు. ఇప్పుడిప్పుడే.. ఇతర రాష్ట్రాలు ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్‌లను నిర్వహించడం ప్రారంభిస్తున్నాయన్నారు. ఏపీలో జరిగే ఈ ఇన్వెస్టర్ల సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించనున్నట్టుగా చెప్పారు.

'ఎంఎస్ఎంఈ(MSME)లపై ఫోకస్ పెట్టాము. ఏపీలో పరిశ్రమల అభివృద్ధికి మౌలిక వసతులను కల్పిస్తున్నాం. విశాఖ, కాకినాడ పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం. మచిలీపట్నం(Machilipatnam), భావనపాడు పోర్టులను నిర్మిస్తున్నాం. ఐదు షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతోంది. రామాయపట్నం పోర్టు(Ramayapatnam Port)కి 2024 జనవరి నాటికి మొదటి షిప్‌ తెచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. దేశానికి ఏపీనే ముఖ ద్వారంగా మార్చేలా ప్రణాళికలు జరుగుతున్నాయి. . ఆర్థికాభివృద్ధిలో మన రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తుంది.' అని మంత్రి అమర్ నాథ్ అన్నారు.

మరోవైపు విశాఖలో ఈ నెల 12న ప్రధాని మోదీ పర్యటన(Modi Vizag Tour) ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ముఖ్య నేతలతో మంత్రి గుడివాడ సోమవారం సమావేశమైయ్యారు. నేతలకు బాధ్యతలను అప్పగించారు. రెండు రోజుల పర్యటనకు విశాఖ నగరానికి వస్తున్న ప్రధాని మోదీ రూ.10 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

రూ.ఐదువేల కోట్లతో నిర్మించనున్న భోగాపురం విమానాశ్రయం(Bhogapuram Airport) శంకుస్థాపన చేయడానికి అవకాశాలను పరిశీలించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని అమర్ నాథ్ తెలిపారు. మోదీకి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై మాట్లాడారు.

IPL_Entry_Point