APRJC ADMISSIONS: ఏపీఆర్జేసీ మూడో జాబితా విడుదల-aprjc and aprdc third round admission list released ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Aprjc Admissions: ఏపీఆర్జేసీ మూడో జాబితా విడుదల

APRJC ADMISSIONS: ఏపీఆర్జేసీ మూడో జాబితా విడుదల

HT Telugu Desk HT Telugu
Aug 05, 2022 11:50 AM IST

ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం మూడో జాబితాను ప్రకటించారు. అర్హులైన విద్యార్ధులు కాల్‌ లెటర్‌ డౌన్‌లోడ్ చేసుకుని సంబంధిత కళాశాలలో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది.

ఏపీఆర్జేసీ మూడో విడత అర్హుల జాబితా విడుదల
ఏపీఆర్జేసీ మూడో విడత అర్హుల జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయ సంస్థ నిర్వహిస్తున్న ఏపీఆర్జేసీ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం మూడో విడత అర్హుల జాబితా విడుదల చేశారు.

ఏపీ గురుకుల విద్యాలయ సంస్థ నిర్వహిస్తున్న ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలతో పాటు నాగార్జున సాగర్‌లోని డిగ్రీ కాలేజీలో మొదట ఏడాది అడ్మిషన్ల కోసం ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ సెట్‌ 2022 నిర్వహించారు. ఈ కాలేజీల్లో అడ్మిషన్లకు అర్హత సాధించిన వారి జాబితాను వెబ్‌సైట్‌లో విడుదల చేశారు. https://aprs.apcfss.in వెబ్‌సైట్‌లో అర్హుల జాబితాను గురుకుల విద్యాలయాల శాఖ విడుదల చేసింది.

ఎంట్రన్స్‌ పరీక్ష రాసిన విద్యార్ధులు తమ హాల్ టిక్కెట్, పుట్టిన తేదీల ఆధారంగా ఫలితాలు తెలుసుకోవచ్చు. మూడో విడత ఎంపికైన విద్యార్ధులు సెలక్షన్‌ లెటర్‌లను డౌన్‌ లోడ్ చేసుకుని ఆగష్టు 7న తమ ఒరిజినల్ ధృవపత్రాలు, ఆధార్‌ కార్డు, పాస్‌పోర్ట్‌ ఫోటోలతో అయా కాలేజీ ప్రిన్సిపల్‌‌కు రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. మూడో విడత అడ్మిషన్ల ఆధారంగా మలి విడత అడ్మిషన్లను ఖరారు చేస్తారు.

నవంబరులో పాలిటెక్ ఫెస్ట్‌..

విద్యార్ధుల్లో సృజనాత్మకతను వెలికితీసి నూతన ఆవిష్కరణల దిశలో ప్రోత్సహించేందుకు పాలిటెక్‌ ఫెస్ట్‌ నిర్వహిస్తున్నారు. 2022-23 విద్యా సంవత్సరాలతో ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పాలిటెక్నిక్ విద్యార్ధుల శాస్త్రీయ ఆలోచనలు, వినూత్న ఆవిష్కరణలు చేసేలా టెక్నికల్ ఫెస్ట్‌ ఉపకరిస్తుందని అధికారులు చెబుతున్నారు.

జిల్లా, రాష్ట్ర స్థాయిలో టెక్‌ ఫెస్ట్‌ కార్యక్రమాలను సాంకేతిక విద్యాశాఖ నిర్వహించనుంది. జిల్లా స్థాయిలో నవంబర్‌ 14 నుంచి 17వరకు, రాష్ట్ర స్థాయిలో నవంబర్ 24 నుంచి 26వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అన్ని కాలేజీల విద్యార్ధులను పాలి టెక్‌ ఫెస్ట్‌‌లో పాల్గొనేలా కాలేజీల సిబ్బంది, ప్రిన్సిపాళ్లకు ప్రోత్సహించాలని సూచించారు.

IPL_Entry_Point

టాపిక్