AP Road Accidents: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు, గన్నవరం, తిరుపతిలో హైవేలపై అదుపు తప్పిన కార్లు-fatal road accidents in ap cars out of control on highways in gannavaram and tirupati ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Road Accidents: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు, గన్నవరం, తిరుపతిలో హైవేలపై అదుపు తప్పిన కార్లు

AP Road Accidents: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు, గన్నవరం, తిరుపతిలో హైవేలపై అదుపు తప్పిన కార్లు

Sarath chandra.B HT Telugu
May 27, 2024 08:43 AM IST

AP Road Accidents: ఏపీలో జాతీయ రహదారులు నెత్తురోడాయి. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. తిరుపతి, కృష్ణా జిల్లాల్లో ఘోర ప్రమాదాలు జరిగాయి.

ఏపీ జాతీయ రహదారులపై ఘోర రోడ్డుప్రమాదాలు
ఏపీ జాతీయ రహదారులపై ఘోర రోడ్డుప్రమాదాలు

AP Road Accidents: మితిమీరిన వేగం, వాహనాలను నియంత్రించ లేకపోవడంతో ఏపీలో ఒకే రోజు రెండు ఘోర ప్రమాదాలు జరిగాయి. జాతీయ రహదారులపై జరిగిన ప్రమాదాల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

కృష్ణాజిల్లా గన్నవరం హైవేపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతులను తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. బాపులపాడు మండలం కోడూరుపాడు దగ్గర ఈ ఘటన జరిగింది.

గన్నవరం దాటిన తర్వాత డివైడర్‌ను ఢీకొన్న తమిళనాడు రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉన్న కారు డివైడర్‌ను దాటుకుని రోడ్డుకు అవతలి వైపు ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు తునాతునకలైంది. అందులో ప్రయాణిస్తున్న వారి శరీరాలు శరీరాలు చిధ్రమై పోయాయి. ఈ ఘటతో జాతీయ రహదారి మొత్తం బీతావహంగా మారింది.

బాపులపాడు మండలం కోడూరుపాడు హెచ్ పి పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో  నలుగురు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.  సమాచారం అందుకున్న హనుమాన్ జంక్షన్ సిఐ అల్లు లక్ష్మీ నరసింహమూర్తి, వీరవల్లి ఎస్ ఐ చిరంజీవి తన పోలీసులు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. 

కొవ్వూరు నుంచి తమిళనాడు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది తమిళనాడు కి చెందిన వీరు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతులను  స్వామినాథన్ (40) , రాకేష్ (12) రాధప్రియ(14) గోపి(23) గా గుర్తించారు.  సత్య 28 (స్వామినాథన్ భార్య ) తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన సత్యను  వైద్య చికిత్స నిమిత్తం అంబులెన్సులో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తిరుపతిలో మరో ప్రమాదం…

తిరుపతి జిల్లా చంద్రగిరిలోమరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు మృతి చెందారు. అందులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లి వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. నెల్లూరు నుంచి వేలూరు వెళుతున్న ఏపీ 26బిహెచ్‌ 5999నంబర్ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో శరీరాలు కారులో ఇరుక్కు పోవడంతో పోలీసులు తలుపుల్ని పగులగొట్టి క్షతగాత్రుల్ని బయటకు తీశారు. నెల్లూరు నుంచి వేలూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

చంద్రగిరిలో దగ్ధమైన కారు…

చంద్రగిరి మండల పరిధిలోని సి.మల్లవరం జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డు అవతలి వైపుకు దూసుకెళ్లింది. దీంతో కారులో మంటలు వ్యాపించడంతో వాహనం దగ్ధమైంది. కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు బయటకి రావడంతో ప్రాణాపాయం తప్పించుకున్నారు. వారికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. తిరుపతి నుంచి చంద్రగిరికి వెళుతుండగా ప్రమాదం జరిగింది.

జగ్గంపేటలో రిటైర్డ్ జడ్జి దుర్మరణం….

జగ్గంపేట సమీపంలోని రామవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ జడ్జి మోహన్ రావు దుర్మరణం పాలయ్యారు. జడ్జి ప్రయాణిస్తున్న కారును వెనుక వచ్చిన కేవీఆర్ ట్రావెల్స్‌ బస్సు బలంగా ఢీకొట్టడంతో ఆదుపు తప్పి ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న రిటైర్డ్ జడ్జి మోహన్‌రావుతో పాటు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణమైన బస్సు ఘటనా స్థలంలో ఆగకుండా వెళ్ళిపోయింది. ప్రమాదం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ బస్సును వెంటాడి పట్టుకున్నారు. బస్సు డ్రైవర్‌ ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని తేల్చారు.

Whats_app_banner