YSR Raithu Bharosa: నేడు ఏపీలో మూడో విడత రైతు భరోసా నిధుల విడుదల.. క్యాంపు కార్యాలయం విడుదల చేయనున్న సిఎం జగన్-cm jagan will release the third installment of rythu bharosa funds in ap today ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysr Raithu Bharosa: నేడు ఏపీలో మూడో విడత రైతు భరోసా నిధుల విడుదల.. క్యాంపు కార్యాలయం విడుదల చేయనున్న సిఎం జగన్

YSR Raithu Bharosa: నేడు ఏపీలో మూడో విడత రైతు భరోసా నిధుల విడుదల.. క్యాంపు కార్యాలయం విడుదల చేయనున్న సిఎం జగన్

Sarath chandra.B HT Telugu
Feb 28, 2024 06:00 AM IST

YSR Raithu Bharosa: ఏపీలో మూడో విడత రైతు భరోసా నిధులను నేడు విడుదల చేయనున్నారు. క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో సిఎం జగన్ నిధుల్ని విడుదల చేస్తారు.

నేడు రైతు భరోసా మూడో విడత నిధుల విడుదల
నేడు రైతు భరోసా మూడో విడత నిధుల విడుదల (HT )

YSR Raithu Bharosa: అన్నదాతలను అన్నివిధాలుగా ఆదుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కలిపి అందిస్తున్న PM Kisanపిఎం కిసాన్-వైఎస్సార్ రైతు భరోసా నిధుల్ని నేడు విడుదల చేయనున్నారు.

వరుసగా ఐదో ఏడాది రైతు భరోసా నిధుల్ని రైతాంగానికి అందిస్తున్నారు. ఈ ఏడాదికి మూడో విడతగా నిధులు విడుదల చేస్తున్నారు. వైఎస్సార్ రైతు భరోసా -PM KISAN ద్వారా రైతులకు ఒక్కొక్కరికి ఏటా రూ. 13,500 చొప్పున వరుసగా 4 ఏళ్ళు రైతు భరోసా-PM KISAN సాయం అందించారు. ఐదో ఏడాది" ఇప్పటికే రెండు విడతల్లో ఒక్కొక్కరికి రూ. 11,500 సాయం అందించారు.

మూడో విడతలో ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున 53.58 లక్షల మంది రైతులకు 1,078.36 కోట్లనుYSR Raithu Bharosa ద్వారా జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఫిబ్రవరి 28న నిధుల విడుదల చేయనున్నారు.

సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతన్నలతో పాటు ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీ కౌలు రైతులు, RoFR (అటవీ), దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా "వైఎస్సార్ రైతు భరోసా" క్రింద ఏటా రూ.13,500 రైతు భరోసా సాయం అందిస్తున్నారు.

ఐదో విడతలో అందిస్తున్న సాయంతో కలిపి ఒక్కో రైతులకు కేవలం ఒక్క రైతు భరోసా - PM KISAN" ద్వారా మేనిఫెస్టోలో చెప్పిన రూ.50,000 ఆర్ధిక సాయం కంటే కన్నా మిన్నగా 57 నెలల్లో మొత్తం రూ. 67,500 సాయం అందించారు.

రైతులకు తాజాగా అందిస్తున్న సాయం రూ. 1,078.36 కోట్లతో కలిపి 57 నెలల్లో రైతన్నలకు అందించిన మొత్తంలో కేవలం "వైఎస్సార్ రైతు భరోసా - PN KISAN" సాయంగా రూ. 34,288 కోట్లు చెల్లించనున్నారు.

మ్యానిఫెస్టోలో ఏటా రూ.12,500 చొప్పున 4ఏళ్లలో రూ. 50,000 ఆర్ధిక సాయం అందిస్తామని చెప్పినా ఐదేళ్లలో కేంద్రం ఇచ్చిన నిధులతో కలిపి ప్రభుత్వం రూ.67,500 చెల్లించింది. మ్యానిఫెస్టోలో చెప్పినదానికన్నా ఒక్కో రైతన్నకు అదనంగా మొత్తం రూ.17,500 చెల్లించారు.

“రైతు భరోసాYSR Raithu Bharosa -PM KISAN" క్రింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 13,500 చెల్లిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

ఏటా మొదటి విడత ఖరీఫ్ పంట వేసే ముందు మే/జాన్ నెలలో రూ.7,500, రెండవ విడత అక్టోబర్ -నవంబర్ నెలలో ఖరీఫ్ పంట కోత సమయం రబీ అవసరాల కోసం రూ. 4,000, మూడవ విడత పంట ఇంటికి వచ్చే సమయాన జనవరి-ఫిబ్రవరి నెలలో రూ. 2,000 చెల్లిస్తున్నారు. 57 నెలల్లో రైతన్నలకు అందించిన మొత్తం సాయం.. రూ. 1,84,567 కోట్లు ఉందని ప్రభుత్వం చెబుతోంది.

వైఎస్సార్ సున్నా వడ్డీ పంటరుణాలు

రైతు భరోసా నిధులతో పాటు వరుసగా నాలుగో ఏడాది రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు చెల్లించనున్నారు. రబీ 2021-22, ఖరీఫ్ 2022 లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 10,78,615 మంది రైతన్నలకు రూ. 215.98 కోట్ల వడ్డీ రాయితీ సొమ్ము బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.

2014-15 నుండి 2018-19 వరకు పెండింగ్ పెట్టిన బకాయిలతో సహా..నేడు అందిస్తున్న రూ.215.98 కోట్లతో కలిపి, 57 నెలల్లో "వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు" క్రింద 84.66 లక్షల మంది రైతులకు రూ.2,050.53 కోట్లు వడ్డీ రాయితీగా చెల్లించారు.

అన్నదాతలు అప్పుల ఊబిలో పడిపోకుండా వారికి అండగా నిలుస్తూ.. ఈ-క్రాప్ డేటా ఆధారంగా లక్ష రూపాయల లోపు పంట రుణాలు తీసుకొని ఏడాది లోపు సమయానికి తిరిగి చెల్లించిన రైతన్నలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం క్రింద పూర్తి వడ్డీ రాయితీని ప్రభుత్వం అందిస్తోంది..!

వైఎస్సార్ రైతు భరోసా- PM Kisan, వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాల పథకాల క్రింద రాష్ట్రంలోని రైతన్నలకు మొత్తం రూ. 1,294.34 కోట్లు ఆర్ధిక సాయంగా బుధవారం విడుదల చేయనున్నారు.