AP Free Gas Cylinders : ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్.. మరో ఆఫర్ ఇచ్చిన కూటమి సర్కారు!-booking for first free cylinder in ap from 29th october to 31st march 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Free Gas Cylinders : ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్.. మరో ఆఫర్ ఇచ్చిన కూటమి సర్కారు!

AP Free Gas Cylinders : ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్.. మరో ఆఫర్ ఇచ్చిన కూటమి సర్కారు!

Basani Shiva Kumar HT Telugu
Oct 29, 2024 11:15 AM IST

AP Free Gas Cylinders : ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వీలైనంత ఎక్కువ మంది లబ్ధిపొందేలా చర్యలు చేపడుతోంది. తాజాగా ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. మొదటి విడత ఫ్రీ గ్యాస్ సిలిండర్‌ను ఇవాళ్టి నుంచి 2024 మార్చి 31 వరకు బుక్ చేసుకోవచ్చని తెలిపింది.

ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్
ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్

దీపావళి నుంచి దీపం 2 పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత సిలిండర్ పంపిణీని ప్రారంభిస్తుందని.. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ వివరించారు. అక్టోబర్‌ 29 నుంచి.. 2025 మార్చి 31వ తేదీ వరకు మొదటి ఉచిత సిలిండర్‌ కోసం బుకింగ్‌ చేసుకోవచ్చని సూచించారు. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నాలుగు నెలలకోసారి ఉచిత సిలిండర్‌ అందిస్తామని వివరించారు. సిలిండర్ ఇంటికి చేరిన 48 గంటల్లోగా వినియోగదారు ఖాతాలో రాయితీ డబ్బు జమ అవుతుందని వివరించారు.

8 ముఖ్యాంశాలు..

1. దీపం-2 పథకం అమల్లో భాగంగా ఈ నెల 29 నుండి గ్యాస్ బుకింగ్స్ ప్రారంభిస్తారు.

2. గ్యాస్ బుకింగ్ చేసుకోగానే ఒక మేసేజ్ లబ్దిదారుని ఫోన్ నెంబరుకు వెళుతుంది.

3. గ్యాస్ బుక్ చేసుకున్న 24 గంటల్లో పట్టణ ప్రాంతాల్లో, 48 గంటల్లో గ్రామీణా ప్రాంతాల్లో గ్యాస్ సిలిండ్లను డెలివరీ చేయడం జరుగుతుంది.

4. గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన 48 గంటల్లోనే డీబీటీ విధానం ద్వారా లబ్దిదారుల ఖాతాలోని రాయితీ సొమ్ము జమ అవుతుంది.

5. ప్రభుత్వం అందజేసే మూడు ఉచిత సిలిండర్లలో మొదటి సిలిండర్ మార్చి 31 లోపు, రెండోది జూలై 31 లోపు, మూడోది నవంబరు 30 లోపు ఎప్పుడైనా పొందవచ్చు.

6. ఈ పథకం అమలుకై ఏడాదిని మూడు బ్లాక్ పీడియడ్లుగా పరిగణించడం జరుగుతుంది. మొదటి బ్లాక్ పీడియడ్ ఏప్రిల్ 1 నుండి జూలై 31 వరకు, రెండో బ్లాక్ పీడియడ్ ను ఆగస్టు 1 నుండి నవంబరు 31 వరకు, మూడో బ్లాక్ పీడియడ్‌ను డిసెంబరు 1 నుండి మార్చి 31 వరకు పరిగణించడం జరుగుతుంది.

7. ఈ పథకం అమల్లో లబ్దిదారులకు ఏమన్నా సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీ నెం.1967 కు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు.

8. ఈ నెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వెంటనే ప్రతి ఇంటికీ మొదటి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయడం జరుగుతుంది.

ఈకేవైసీ తప్పనిసరి..

మ‌రోవైపు ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ల ప‌థ‌కానికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఈకేవైసీని త‌ప్ప‌నిస‌రి చేసింది. దీంతో ప్ర‌జ‌లకు క‌ష్టాలు ప్రారంభ‌మైయ్యాయి. ఈకేవైసీకి దూరంగా నేటికీ 20 ల‌క్ష‌ల వినియోగ‌దారులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేష‌న్ కార్డుదారులు 1.47 కోట్ల‌ మంది ఉండ‌గా.. అందులో నేటికీ సుమారు 20 ల‌క్ష‌ల‌పైగా గ్యాస్ ఏజెన్సీల వ‌ద్ద ఈకేవైసీ చేసుకోలేద‌ని అధికారులు చెబుతున్నారు. ఈకేవైసీ కానిప‌క్షంలో గ్యాస్ కంపెనీల వ‌ద్ద ఉండే డేటా, ప్ర‌భుత్వం వ‌ద్ద ఉండే డేటా స‌రిపోయే అవ‌కాశాలు లేవు.

Whats_app_banner