Bhola Shankar Tickets Price Hike: భోళా శంకర్ టికెట్ల ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?
Bhola Shankar Tickets Price Hike: భోళా శంకర్ టికెట్ల ధరలను పెంపు కోసం మూవీ టీమ్ ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసినట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. టికెట్ల ధరల పెంపుపై సోమవారం సాయంత్రం ప్రభుత్వం తుది నిర్ణయాన్ని వెల్లడించబోతున్నట్లు సమాచారం.
Bhola Shankar Tickets Price Hike: చిరంజీవి భోళాశంకర్ మూవీ టికెట్ల ధరల పెంపుపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది మెగా అభిమానులతో పాటు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
తెలంగాణతో పోలిస్తే ఏపీలో సినిమా టికెట్ ధరలు చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో మల్టీప్లెక్స్‌లతో పాటు సింగిల్ స్క్రీన్స్‌లో 25 రూపాయలు పెంచుకునేలా భోళా శంకర్ టీమ్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సినిమా బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకొనే టికెట్ల రేట్లను పెంచుకోవడానికి మూవీ టీమ్ అనుమతిని కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
భోళా శంకర్ టికెట్స్ రేట్స్ పెంపుపై ప్రభుత్వ వర్గాలు సోమవారం సాయంత్రం ఓ క్లారిటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా జగన్‌తో పాటు వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోన్న నేపథ్యంలో భోళా శంకర్ టీమ్‌కు జగన్ ప్రభుత్వం షాక్ ఇవ్వబోతున్నట్లు చెబుతోన్నారు.
టికెట్స్ రేట్ల పెంపుకు అనుమతులు ఇవ్వడం అనుమానమేనని అంటున్నారు. మరోవైపు తెలంగాణలో మాత్రం సాధారణ ధరలతోనే భోళా శంకర్ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 11న వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ కానుంది.
తమిళంలో విజయవంతమైన వేదాళం సినిమాకు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోండగా తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. సుశాంత్ కీలక పాత్రను పోషిస్తున్నారు. దాదాపు 70 కోట్లకుపైగా బడ్జెట్‌తో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర భోళా శంకర్ మూవీని నిర్మిస్తున్నాడు.