Bail to Pattabhi: టీడీపీ నేత పట్టాభికి ఊరట.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు-bail granted to tdp leader pattabhi ram and other leaders ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Bail Granted To Tdp Leader Pattabhi Ram And Other Leaders

Bail to Pattabhi: టీడీపీ నేత పట్టాభికి ఊరట.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు

HT Telugu Desk HT Telugu
Mar 03, 2023 08:32 PM IST

Bail granted to TDP leader Pattabhi Ram:టీడీపీ నేతపట్టాభికి ఊరట దొరికింది. ప్రస్తుతం జైల్లో ఉన్న ఆయనకు… న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని కోర్టు స్పష్టం చేసింది.

టీడీపీ నేత పట్టాభి
టీడీపీ నేత పట్టాభి

Bail granted to TDP leader Pattabhi: తెలుగుదేశం పార్టీ నేత కొమ్మారెడ్డి పట్టాభికి ఊరట లభించింది. కృష్ణాజిల్లా గన్నవరం ఘటన కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 3 నెలల పాటు ప్రతి గురువారం కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలని.. సాక్షులను ప్రభావితం చేయరాదని పట్టాభికి స్పష్టం చేసింది. ఇదే కేసుకు సంబంధించి మరో 13 మంది తెలుగుదేశం పార్టీ నేతలకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు అయింది.

ట్రెండింగ్ వార్తలు

గన్నవరం కేసులో అరెస్ట్...

కృష్ణా జిల్లా గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి జరగగా... ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులే దాడికి పాల్పడ్డారని టీడీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. దాడిని నిరసిస్తూ.. టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో గన్నవరం కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సమయంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఘర్షణల కేసులో టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాంతో సహా 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. టిడిపి కార్యాలయంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు, వైసిపి కార్యకర్తలు దాడికి పాల్పడినట్లు తెలిసి పట్టాభి అక్కడి వెళ్లారు. ఈ క్రమంలోనే దాడి సమయంలో పోలీసుల తీరును నిరసిస్తూ డిజిపి కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పట్టాభితో పాటు మరికొందరు టిడిపి నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మిగతా టీడీపీ నేతలను గన్నవరం కోర్టులో హాజరుపరిచారు. గన్నవరంలో పోలీస్ స్టేషన్ లోనే అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి.. వ్యానులో తరలించి.. న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. పట్టాభి.. టీడీపీ నేతలు తనను కులం పేరుతో దూషించారని.. ప్రాణహాని కలిగించేందుకు యత్నించారని సీఐ కనకరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు... టీడీపీ నేతలపై హత్యాయత్నం, అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పట్టాభిని ఏ 1 గా... ఏ - 2గా చిన్న... సహా మరో 13 మందిపై కేసులు ఫైల్ చేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్