AP Govt Jobs : ఏపీలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ - డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటన, ముఖ్య తేదీలివే
APPSC Degree Lecturer Notification Updates:ఏపీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 24 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి.
APPSC Degree Lecturer Notification 2023: ఆంధ్రప్రదేశ్ సర్కార్ వరుస ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. ఇప్పటికే కీలకమైన గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రకటనలు ఇవ్వగా… తాాజాగా మరో ప్రకటన జారీ చేసింది ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 240 పోస్టులను భర్తీ చేయనుంది. జనవరి 24 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయని ఏపీపీఎస్సీ పేర్కొంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి వివరాలు ఇక్కడ చూడండి....
ముఖ్య వివరాలు :
ఉద్యోగ ప్రకటన - ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
ఉద్యోగాలు - డిగ్రీ లెక్చరర్
మొత్తం ఖాళీలు - 240
సబ్జెక్టులు - 11(వృక్షశాస్త్రం, కెమిస్ట్రీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఎకామనిక్స్, హిస్టరీ, మ్యాథ్స్, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్, జువాలజీ).
అర్హత - సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించాలి. సెట్, నెట్ వంటి అర్హత పరీక్షలు పాస్ కావాలి. ఈ వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.
దరఖాస్తులు - ఆన్ లైన్
దరఖాస్తులు ప్రారంభం - 24, జనవరి 2024.
ఆన్ లైన్ దరఖాస్తులకు తుది గడువు - 13, ఫిబ్రవరి 2024.
ఎగ్జామ్ తేదీ - ఏప్రిల్/ మే, 2024.
ఎగ్జామ్ విధానం - ఆబ్జెక్టివ్ విధానంలో 2 పేపర్లు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (పేపర్–1) 150 మార్కులకు డిగ్రీ స్థాయిలో ఉంటుంది. పేపర్–2 సంబంధిత సబ్జెక్టు పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో 150 ప్రశ్నలు 300 మార్కులకు ఉంటుంది. తప్పు సమాధానానికి మైనస్ మార్కులు ఉంటాయి.
అధికారిక వెబ్ సైట్ - https://psc.ap.gov.in/