AP Group 1 Notification : నిరుద్యోగులకు మరో తీపి కబురు.. ఏపీ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల - ముఖ్య తేదీలివే
APPSC Group 1 Notification : నిరుద్యోగులకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. 81 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
APPSC Group 1 Notification 2023 : నిరుద్యోగులకి మరో తీపికబురు చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గురువారమే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వగా… తాజాగా కీలకమైన గ్రూప్ - 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా… 81 పోస్టులను భర్తీ చేయనుంది. మర్చి 17న ప్రిలిమనరీ పరీక్ష ఉంటుందని తెలిపింది. జనవరి 1 నుంచి జనవరి 21 వరకు ధరఖాస్తుల స్వీకరించనుంది. ఇందులో డిప్యూటీ కలెక్టర్ 9, డిఎస్పీలు 26 పోస్టులు ఉన్నాయి.
నిన్ననే గ్రూప్ 2 నోటిఫికేషన్
మరోవైపు గురువారమే 897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ . ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331..... నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566 ఉన్నాయి. ఫిబ్రవరి 25వ తేదీన ప్రిలిమనరీ పరీక్ష ఉంటుందని తెలిపింది. డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు ధరఖాస్తుల స్వీకరణ ఉంటుందని వెల్లడించింది.
APPSC Group 2 Syllabus 2023: ఇటీవలే కొత్తగా ప్రకటించిన సిలబస్ ప్రకారం… 150 మార్కులకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్టులో భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, భారతీయ సమాజం, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.ఇందులో కొత్తగా భారతీయ సమాజం అంశాన్ని చేర్చారు ఒక్కో సెక్షన్ కు 30 మార్కులు కేటాయించారు. ఇందులో అర్హత సాధిస్తేనే మెయిన్స్ కు అర్హులు అవుతారు..మెయిన్స్‌లో మొత్తం 2 పేపర్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 150 మార్కులు కేటాయించారు. పేపర్-1లో చూస్తే ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం అంశాలు ఉన్నాయి. ఇక పేపర్-2లో చూస్తే భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్ కు 75 మార్కులు కేటాయించారు.
కొద్దిరోజుల కిందటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Andhra Pradesh Public Service Commission) - ఏపీపీఎస్సీ పలు ఉద్యోగ నియామకాల్లో కీలక మార్పులు చేసింది. గ్రూప్ - 2 (Group-2)... గ్రూప్ - 3 (Group -2) రిక్రూట్మెంట్లకు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ ఉద్యోగాలకు పోటీ పడే వారికి కంప్యూటర్ అర్హత తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రూప్ -2, గ్రూప్ - 3 ఉద్యోగ నియామకాల్లో కంప్యూటర్ ప్రొఫిషీయన్సీ సర్టిఫికెట్ ను తప్పనిసరి పొందాల్సి ఉంటుంది. కొత్త రూల్స్ ప్రకారం... గ్రూప్ - 2, గ్రూప్ -3 నోటిఫికేషన్ల ద్వారా నియమితులయ్యే వారంతా ఏపీపీఎస్సీ లేదా ఏపీ సాంకేతిక విద్యా బోర్డు నిర్వహించే కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ టెస్టు (సీపీటీ) (Computer Proficiency test) పాస్ కావాల్సిందే. 100 మార్కులకి నిర్వహించే ఈ పరీక్షలో అర్హత సాధించేందుకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు కనీసం 30 మార్కులు... బీసీలు 35.. ఓసీలు 40 మార్కులు సాధించాల్సి ఉంటుంది.