AP PGECET 2023 :ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల
AP PGECET 2023 Results: ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. https://cets.apsche.ap.gov.in లింక్ ద్వారా ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
AP PGECET 2023 Results Updates: ఏపీ పీజీ ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశపరీక్ష (AP PGECET)-2023 ఫలితాలు వచ్చేశాయ్. ఈ ఫలితాలను గురువారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య హేమచంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాదికి సంబంధించి మొత్తం 5,970మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.... 86.72 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. పీజీఈసెట్ ర్యాంకుల ఆధారంగా రాష్ట్రంలోని ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. https://cets.apsche.ap.gov.in లింక్ ద్వారా ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి...
అభ్యర్థులు మొదటగా https://cets.apsche.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
డౌన్లోడ్ ర్యాంక్ కార్డు అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
Registration Number , PGECET Hallticket No , పుట్టినతేదీ వివరాలను నమోదు చేయాలి.
వ్యూ ర్యాంక్ కార్డు అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందవచ్చు.
ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల
AP ICET Results 2023: ఆంధ్రప్రదేశ్ ఐసెట్ - 2023 ఫలితాలు వచ్చేశాయి. గురువారం(జూన్ 15) మధ్యాహ్నం తర్వాత ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. ర్యాంకుల ఆధారంగా ఏపీలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ఏడాదికి సంబంధించిన ప్రవేశ పరీక్షను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్వహించింది. ఈ ఏడాది ప్రవేశ పరీక్షకు గాను... 44 వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. https://cets.apsche.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
- అభ్యర్థులు మొదటగా https://cets.apsche.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- Results అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- Registration Number , హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
- View Results ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ ఫలితం డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీ పొందవచ్చు.
- అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు అత్యంక కీలకం. భవిష్యత్ అవసరాల దృష్ట్యా జాగ్రత్తగా ఉంచుకోవాలి.
రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు మే 24న ఈ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీలో 109, తెలంగాణలో 2 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షను 44 వేల మందికి పైగా విద్యార్థులు రాశారు. తాజా ఫలితాల్లో జగదీశ్‌కుమార్‌రెడ్డి (రేణిగుంట) టాపర్ గా నిలవగా… సికింద్రాబాద్ కు చెందిన సాయివెంకట కార్తీక్ స్టేట్ సెకండ్ టాపర్ గా ఉన్నారు.