AP Mlc Election Schedule: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల,జూలై 12న పోలింగ్-ap mla quota mlc by election schedule released polling on july 12 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Mlc Election Schedule: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల,జూలై 12న పోలింగ్

AP Mlc Election Schedule: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల,జూలై 12న పోలింగ్

Sarath chandra.B HT Telugu
Jun 19, 2024 09:51 AM IST

AP Mlc Election Schedule: ఏపీలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీ శాసనమండలి సభ్యత్వాలను భర్తీ చేసేందుకు ఎన్నికలు నిర్వహించనున్నారు

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం (HT_PRINT)

AP Mlc Election Schedule: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింద.ి దేశంలోని నాలుగు రాష్ట్రాల పరిధిలో ఖాళీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు జులై 12న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.

ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలతో పాటు... కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బిహార్లలో ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి.

ఏపీలో వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన రామచంద్రయ్య ఎన్నికలకు ముందు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. రామచంద్రయ్యపై మార్చి 11న అనర్హత అనర్హత వేటు పడింది. వైసీపీ తర పున ఎన్నికైన మాజీ ఐపీఎస్ అధికారి షేక్ మహ్మద్ ఇక్బాల్ కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.

రామచంద్రయ్య, ఇక్బాల్ ప్రాతినిథ్యం వహించిన స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇద్దరి పదవీకాలం 2027 మార్చి 29 వరకు ఉంది. శాసనమండలిలో ఖాళీ అయిన ఈ రెండు స్థానాలను భర్తీ చేయడానికి ఈ నెల 25న నోటిఫికేషన్ విడుదల కానుంది.

ఏపీ అసెంబ్లీలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలోని రెండు స్థానాలతో పాటు కర్ణాటక, బీహార్‌, యూపీలోని ఒక్కో స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగు రాష్ట్రాల్లోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయనున్నారు.

  • ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జూన్ 25వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
  • జూలై 2వరకు ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లను స్వీకరిస్తారు.
  • జూలై3వ తేదీన నామినేషన్ దరఖాస్తుల్ని పరిశీలిస్తారు.
  • నామినేషన్ల ఉపసంహరణకు జూలై 5వరకు గడువుగా నిర్ణయించారు.
  • జూలై 12న పోలింగ్ నిర్వహిస్తారు.
  • ఉదయం 9 గంటల నుంచి 4గంటల వరకు శాసనసభ ప్రాంగణాల్లో పోలింగ్ నిర్వహిస్తారు.
  • జూలై 12న కౌంటింగ్ నిర్వహిస్తారు. అదే రోజు ఫలితాలను విడుదల చేస్తారు.
  • జూలై 16లోపు ఎన్నికల ప్రక్రియను ముగిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆ స్థానాలను ఆశించే వారు అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో అభ్యర్థుల ఎంపిక కూడా ఆసక్తికరంగా మారింది. టీడీపీకి పూర్తి బలం ఉన్నా జనసేన ఎమ్మెల్యేలు కూడా 21మంది ఉన్నారు. స్నేహ బంధంలో భాగంగా జనసేనకు కూడా అవకాశం కల్పిస్తారా, రెండు స్థానాలను టీడీపీ అభ్యర్థులతో భర్తీ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. పాతవారితోనే ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేస్తారా, కొత్త వారికి అవకాశం కల్పిస్తారా అనే దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.

Whats_app_banner