CBN Bail Petitions: విచారణ పూర్తయ్యే వరకు బాబుపై చర్యలొద్దన్న హైకోర్టు
CBN Bail Petitions: ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్ర బాబుకు పాక్షిక ఊరట లభించింది. విచారణ పూర్తయ్యే వరకు చంద్రబాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.
CBN Bail Petitions: ఇన్నర్ రింగ్ రోడ్డు, టీడీపీ హయంలో ఉచిత ఇసుక కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు పాక్షిక ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు చంద్రబాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు, ఉచిత ఇసుక కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. IRR కేసులో విచారణను ఈనెల 29కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు, ఉచిత ఇసుక కేసులో విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.
ఇన్నర్ రింగ్ రోడ్డుకు కేసుకు సంబంధించి సిఐడి దాఖలు చేసిన కేసులో చంద్రబాబు వాదనలు వినిపించారు. విచారణలో భాగంగా నేడు అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేకపోవడంతో కేసుల విచారణ ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయంపై సిఐడి 470పేజీల అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బాబుకు బెయిల్ మంజూరు చేయొద్దని కోరింది. హెరిటేజ్ భూముల కొనుగోలుకు ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధం ఉందని, అలైన్‌మెంట్ మార్పు వివరాలతో కూడిన దాదాపు 200 అంశాలతో అఫిడవిట్ దాఖలు చేవారు. ఏజీ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో ఈ కేసును 29వ తేదీకి వాయిదా వేశారు.
ఉచిత ఇసుక పాలసీలో అక్రమాలు జరిగాయని, వందల కోట్ల ఆదాయం గండి పడిందంటూ నమోదైన కేసులో చంద్రబాబు తరపున సిద్ధార్ధ అగర్వాల్ వాదనలు వినిపించారు. ఈ కేసులో చంద్రబాబు ఏ3గా ఉన్నారు. ఏజీ అందుబాటులో లేకపోవడంతో విచారణ 30వతేదీ కి వాయిదా వేశారు. రెండు కేసుల్లో తదుపరి విచారణ జరిగే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సిఐడిని ఏపీ హైకోర్టు ఆదేశించింది