AP Sachivalayam Staff Promotion : సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్, పదోన్నతుల విధివిధానాలు ఖరారు!
AP Sachivalayam Staff Promotion : సచివాలయాల్లో 17 కేటగిరి ఉద్యోగుల పదోన్నతులకు ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. తాజాగా హార్టికల్చర్ ఉద్యోగులకు మండలస్థాయిలో ప్రమోషన్లు కల్పించింది.
AP Sachivalayam Staff Promotion :ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. 17 కేటగిరిలోని ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. నాలుగేళ్ల క్రితం సచివాలయాల్లో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్‌లుగా నియామకమైన వారిలో కొందరికి ప్రమోషన్లు ప్రకటించారు. హార్టికల్చర్ ఉద్యోగులకు అదే శాఖలో మండల స్థాయిలో కేటగిరి-1 హార్టికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్‌గా ప్రమోషన్లు ప్రకటించారు. వివిధ జిల్లాల్లో కేటగిరి-1 హార్టికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టులు మొత్తం 53 ఖాళీ ఉండగా వీటిని విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లతో భర్తీ చేసేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పలు శాఖల ఆధ్వర్యంలో మెుత్తం 19 రకాల కేటగిరి ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో 17 రకాల కేటగిరి ఉద్యోగుల పదోన్నతులకు విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది.
సచివాలయ ఉద్యోగులకు పదోన్నతలు
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కేటగిరి-1 ఉద్యానవన ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ల పోస్టులు నెల రోజుల క్రితం భర్తీ ప్రక్రియ ప్రారంభించారు. ఈ 17 కేటగిరిల్లో గ్రామ, వార్డు ఉద్యోగాలకు సంబంధించి ప్రమోషన్లు ప్రకటించారు. ఈ ఖాళీలను సచివాలయ ఉద్యోగులకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే గ్రామ సచివాలయాల్లో పనిచేసే వెల్ఫేర్ ఎడ్యూకేషన్ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు ప్రమోషన్ల ప్రక్రియకు విధివిధానాలు ఖరారు కావాల్సి ఉందని అధికారులు తెలిపారు.
ప్రభుత్వం కీలక నిర్ణయం
నాలుగేళ్ల క్రితం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలను తీసుకొచ్చింది. లక్షల్లో ఉద్యోగాల నియామకం చేపట్టింది. సచివాలయాల ఉద్యోగులకు ఏడాది క్రితం ప్రొబేషన్ ఖరారు చేసింది. దీంతో వీరందరూ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే పే స్కేలు అందుకుంటున్నారు. వీరిలో కొందరు మండల స్థాయిలో పనిచేసేందుకు ఇటీవల పదోన్నతులు పొందారు. మిగిలిన వారి ప్రమోషన్లకు సంబంధించి ప్రభుత్వం విధివిధానాలను ఖరారు చేస్తుంది. సచివాలయాల ఉద్యోగుల ప్రమోషన్లకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మరో 35 మందికి ప్రమోషన్
ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన శ్రీకాకుళం జిల్లాలో 10 మంది, గుంటూరు జిల్లాలో ఒకరు, వైఎస్సార్ జిల్లాలో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఇద్దరికి నెల రోజుల క్రితం పదోన్నతులు దక్కాయి. మిగిలిన జిల్లాల్లో 35 మందికి ప్రమోషన్లు చేపట్టనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 19 కేటగిరి ఉద్యోగులు పని చేస్తున్నారు. అందులో 17 కేటగిరి ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో పనిచేస్తున్న 1.34 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై ఎప్పటికప్పుడు ఆయా శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రతి నెలా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతోనూ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు.