BBA BCA College Fee : ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో బీబీఏ, బీసీఏ కోర్సుల ఫీజులు ఖరారు, గరిష్టంగా రూ.18 వేలు-ap govt finalized private engineering colleges bba bca courses fees upto 18k ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bba Bca College Fee : ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో బీబీఏ, బీసీఏ కోర్సుల ఫీజులు ఖరారు, గరిష్టంగా రూ.18 వేలు

BBA BCA College Fee : ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో బీబీఏ, బీసీఏ కోర్సుల ఫీజులు ఖరారు, గరిష్టంగా రూ.18 వేలు

HT Telugu Desk HT Telugu
Aug 03, 2024 06:56 PM IST

BBA BCA College Fee : ఏపీ ప్రభుత్వం ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లోని బీబీఏ, బీసీఏ కోర్సుల ఫీజులు ఖరారు చేసింది. ఈ మేరకు జీవో నెం.45 విడుదల చేసింది.

ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో బీబీఏ, బీసీఏ కోర్సుల ఫీజులు ఖరారు
ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో బీబీఏ, బీసీఏ కోర్సుల ఫీజులు ఖరారు

BBA BCA College Fee : రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో బీబీఏ, బీసీఏ కోర్సుల ఫీజుల ఖరారు అయింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబ‌ర్ 45ను విడుద‌ల చేసింది. ఉన్నత విద్యా శాఖ కార్యద‌ర్శి సౌర‌భ్ గౌర్ ఉత్తర్వులు విడుద‌ల చేశారు. ఆర్‌వీఆర్ అండ్ జేసీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ (గుంటూరు)లో బీబీఏ కోర్సుకు ఏడాది ఫీజు రూ. 18,000గా నిర్ణయిచింది. అలాగే జెనెక్స్ విజ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ టెక్నాల‌జీ (నెల్లూరు)లో బీబీఏ కోర్సుకు ఏడాది ఫీజు రూ.18,000గా నిర్ణయించింది. దాడి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీ (అన‌కాప‌ల్లి)లో బీసీఏ కోర్సుకు ఏడాది ఫీజు రూ.18,000గా నిర్ణయించింది.

ఈ ఫీజులో ట్యూష‌న్ ఫీజు, అఫ్లియేష‌న్ ఫీజు, ఐడెంటిటీ కార్డు, మెడిక‌ల్ ఫీజు, ఇంట‌ర్ కాలేజీ, ఇంట‌ర్ యూనివ‌ర్సిటీ స్పోర్ట్స్‌, గేమ్స్‌, క‌ల్చర‌ల్ మీట్ ఫీజు, కంప్యూట‌ర్, ఇంట‌ర్ నెట్ ఫీజు, కాలేజీ మ్యాగ్జిన్ అండ్ స్టూడెంట్ యాక్టివిటీస్ ఫీజు, స్టూడెంట్ హెల్త్ కేర్ స్కీమ్‌, స్టూడెంట్ వెల్ఫేర్ ఫండ్, స్టడీ టూర్‌, పూర్వ విద్యార్థుల ఫండ్‌, స్ఫోర్ట్స్ అండ్ గేమ్స్ ఫీజు, పరీక్షల ఫీజు వంటి అన్ని ఫీజులు క‌లిపి నిర్ణయించిన‌ట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ ఫీజులు 2024-25, 2025-26 రెండు విద్యా సంవ‌త్సరాల‌కు వ‌ర్తిస్తాయి. నాలుగేళ్లు ఈ ఫీజులే బీబీఏ, బీసీఏ కోర్సుల‌కు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. విద్యా సంస్థలు ఎటువంటి ఇత‌ర ఫీజులు వ‌సూలు చేయ‌కూడ‌ద‌ని పేర్కొంది. ఈ మ‌ధ్య కొత్త కాలేజీలు వ‌చ్చినా, ఇప్పటికే ఉన్న కాలేజీల్లో కొత్త కోర్సులు వ‌చ్చినా ఈ ఫీజులు 2025-26 వ‌ర‌కు వ‌ర్తిస్తాయని తెలిపింది. ఏ కాలేజీ బీబీఏ, బీసీఏ కోర్సుల ప్రత్యక్షంగాని, ప‌రోక్షంగాని ఫీజులు మార్చడానికి లేదు. ఫీజుల చెల్లింపుకు సంబంధించి బ్యాంకుల ద్వారానే జ‌ర‌గాల‌ని, ఇత‌ర ఏ రూపాల్లో ఫీజులు వ‌సూలు చేయ‌కూడ‌ద‌ని తెలిపింది. ఫీజులు వ‌సూలకు స‌రైనా బ్యాంకు అకౌంట్స్ ద్వారానే జ‌ర‌గాల‌ని సూచించింది. ఒక‌వేళ వీటిని అమ‌లు చేయ‌క‌పోతే క‌మిష‌న్ తీవ్రమైన‌ చ‌ర్యలు తీసుకుంటుంద‌ని స్పష్టం చేసింది.

అయితే బీబీఏ, బీసీఏ కోర్సులు ఇప్పటి వ‌ర‌కు డిగ్రీ కాలేజీల్లోనే ఉండేవి. అయితే ఆ కోర్సుల‌కు క్రేజ్ పెర‌గ‌డంతో ఇప్పుడు ఇంజినీరింగ్ కాలేజీల్లో కూడా అందుబాటులో వ‌చ్చాయి. దాదాపు 800 డిగ్రీ కాలేజీల్లో బీబీఏ, బీసీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సుమారు 35 ఇంజినీరింగ్ కాలేజీల్లో బీబీఏ, బీసీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం