TG Engineering Counselling : తెలంగాణ ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ పూర్తి, తుది విడత షెడ్యూల్ విడుదల-telangana eapcet 2024 engineering final phase counselling schedule released ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Engineering Counselling : తెలంగాణ ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ పూర్తి, తుది విడత షెడ్యూల్ విడుదల

TG Engineering Counselling : తెలంగాణ ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ పూర్తి, తుది విడత షెడ్యూల్ విడుదల

Bandaru Satyaprasad HT Telugu
Updated Jul 31, 2024 05:23 PM IST

TG Engineering Counselling : తెలంగాణ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ పూర్తైంది. ఇంజినీరింగ్ కోర్సు్ల్లో విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విడుదల చేసింది.

తెలంగాణ ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ పూర్తి, తుది విడత షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ పూర్తి, తుది విడత షెడ్యూల్ విడుదల

TG Engineering Counselling : తెలంగాణ ఈఏపీసెట్ 2024 ఇంజినీరింగ్ కోర్సుల్లో రెండో విడత కౌన్సెలింగ్ పూర్తైంది. ఈ మేరకు విద్యార్థులకు సీట్ల కేటాయింపు చేసింది ఉన్నత విద్యామండలి. రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు వివరాలను ఈఏపీసెట్ వెబ్ సైట్ https://tgeapcet.nic.in/default.aspx లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. రెండో విడతకు ఎంపికైన విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ కు ఆగస్టు 1, 2వ తేదీ వరకు గడువు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 175 ఇంజినీరింగ్ కాలేజీల్లో మొత్తంగా 86,509 సీట్లు ఉన్నాయి. రెండు విడతల కౌన్సెలింగ్ లో 81,490 సీట్లు భర్తీ అయ్యాయని అధికారులు తెలిపారు. ఇంకా 5019 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మిగిలిన సీట్లకు చివరి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ సీట్లు పొందిన విద్యార్థులు చివరి విడత కౌన్సెలింగ్‌ పూర్తయిన తర్వాతే ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. అలాగే తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటించింది.

తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్

  • రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, హెల్ప్ లైన్ సెంటర్ స్లాట్ బుక్కింగ్, మొదటి రెండో విడత కౌన్సెలింగ్ కు హాజరు కాని విద్యార్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ - ఆగస్టు 8, 2024
  • తుది విడత కౌన్సెలింగ్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్(ఇప్పటికే స్టాట్ బుక్ చేసుకున్నవారు) -ఆగస్టు 9, 2024
  • వెబ్ ఆప్షన్లు ఎంపిక -ఆగస్టు 9, 10 తేదీల్లో
  • వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ - ఆగస్టు 10 , 2024
  • తాత్కాలికంగా సీట్లు కేటాయింపు - ఆగస్టు 13, 2024
  • ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్ సైట్ ద్వారా స్వయంగా రిపోర్టింగ్ - ఆగస్టు 13 నుంచి 15 వరకు
  • కాలేజీల్లో రిపోర్టింగ్(కాలేజీ లేదా బ్రాంచ్ మార్పుకునేందుకు) - ఆగస్టు 16 నుంచి 17 వరకు
  • కాలేజీల వారీగా విద్యార్థుల వివరాలు ప్రకటన - ఆగస్టు 17

ఏపీ ఈఏపీసెట్ తుది విడత కౌన్సెలింగ్ పూర్తి

ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీ సెట్ 2024 తుది విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసింది. తుది విడత కౌన్సిలింగ్‌లో 17,575మంది సీట్లు దక్కించుకున్నారు. కౌన్సిలింగ్ పూర్తై తర్వాత తర్వాత దాదాపు 19వేల సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. మొత్తం అన్ని కాలేజీల్లో కలిపి 18,951 ఖాళీలు ఉండిపోయాయి. వీటిని స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్దేశించిన ఎపిఈఎపిసెట్ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా మంగళ వారం తుది విడత సీట్ల కేటాయింపును పూర్తి చేశారు. తుది విడత సీట్ల భర్తీ తర్వాత 18,951 సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయినట్టు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్ గుమ్మల గణేష్ కుమార్ తెలిపారు.

అడ్మిషన్లు పొందిన విధ్యార్ధులు ఆగస్టు 3 లోపు తమకు నిర్దేశించిన కళాశాలల్లో ఆన్ లైన్ రిపోర్టింగ్ పూర్తి చేయడంతో పాటు, వ్యక్తిగతంగా కళాశాలలో పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఏపీలో జులై 19 నుండి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభం అయ్యాయి. ఏపీలో కన్వీనర్ కోటా కింద 24 విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలల్లో 6981 సీట్లు ఉండగా వాటిలో 6153 సీట్లు భర్తీ అయ్యాయన్నారు. యూనివర్శిటీ కాలేజీల్లో 828 సీట్లు మిగిలిపోయాయి.

Whats_app_banner

సంబంధిత కథనం