AP EAPCET 2024 Updates : ఏపీ ఇంజినీరింగ్ ప్రవేశాలు - రిపోర్టింగ్ చేయకుంటే సీటు రద్దే...! 23 నుంచి రెండో విడత కౌన్సెలింగ్-ap eapcet 2024 engineering students who got seats in the first phase should report before july 22 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Eapcet 2024 Updates : ఏపీ ఇంజినీరింగ్ ప్రవేశాలు - రిపోర్టింగ్ చేయకుంటే సీటు రద్దే...! 23 నుంచి రెండో విడత కౌన్సెలింగ్

AP EAPCET 2024 Updates : ఏపీ ఇంజినీరింగ్ ప్రవేశాలు - రిపోర్టింగ్ చేయకుంటే సీటు రద్దే...! 23 నుంచి రెండో విడత కౌన్సెలింగ్

Maheshwaram Mahendra Chary HT Telugu
Published Jul 21, 2024 10:17 AM IST

AP EAPCET (EAMCET) 2024 Updates : ఏపీ ఇంజనీరింగ్ తొలిదశ ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు అధికారులు. జులై 22వ తేదీలోపు సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్టింగ్ చేయాలని సూచించారు. అలా చేయకుంటే సీటు రద్దు అవుతుందని సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు డాక్టర్ నవ్య ఓ ప్రకటనలో తెలిపారు.

ఏపీ ఇంజినీరింగ్ ప్రవేశాలు 2024
ఏపీ ఇంజినీరింగ్ ప్రవేశాలు 2024

AP EAPCET 2024 Updates : ఏపీ ఈఏపిసెట్ 2024 మొదటి దశ అడ్మిషన్లకు సంబంధించి సీట్లు పొందిన విద్యార్థులు తప్పనిసరిగా సోమవారంలోపు రిపోర్టింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు డాక్టర్ బి నవ్య ప్రకటన విడుదల చేశారు.

జులై 17వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు జరిగిందని తెలిపారు. సీటు దక్కించుకున్న అభ్యర్థులు పోర్టల్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీలో ఫిజికల్ రిపోర్టింగ్ తో పాటు అన్ని పనులు జులై 22వ తేదీ లోపు పూర్తి చేసుకోవాలన్నారు. నిర్దేశించిన తేదీని ఖచ్చితంగా పాటించాలని సూచించారు.

విద్యార్థులు రిపోర్ట్ చేయకపోతే కేటాయించిన సీటు 23వ తేదీ నాటికి ఖాళీగా పరిగణించబడుతుందని డాక్టర్ నవ్య స్పష్టం చేశారు. మరోవైపు 23 నుంచి ప్రారంభమయ్యే 2వ దశ అడ్మిషన్ కౌన్సెలింగ్ కు అందుబాటులో ఉన్న సీటుగా చేర్చబడుతుందన్నారు. అన్ని ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు అభ్యర్థి కళాశాలలో నివేదించిన వెంటనే పోర్టల్‌లో చేరే వివరాలను అప్‌ డేట్ చేయాలని పేర్కొన్నారు. కళాశాల యాజమాన్యాలు తప్పనిసరిగా 23 నాటికి పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలన్న విషయాన్ని పరిగణన లోకి తీసుకోవాలని సూచించారు.

AP EAMCET Seat Allotment : ఇలా చెక్ చేసుకోండి

  • ఏపీ ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు https://eapcet-sche.aptonline.in/EAPCET/# వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే Download of Allotment Order అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ అలాట్ మెంట్ అర్డర్ కాపీ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి అలాట్ మెంట్ కాపీని పొందవచ్చు.

ఏపీ ఈఏపీసెట్-2024 పరీక్షలను కాకినాడ జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 142 ప‌రీక్ష కేంద్రాల్లో మే 16 నుంచి 23 వ‌ర‌కు ప‌రీక్షలు జ‌రిగాయి.

ఈ ప‌రీక్షల‌కు రాష్ట్ర వ్యాప్తంగా 3,62,851 మంది ద‌రఖాస్తు చేసుకోగా, అందులో 3,39,139 మంది ప‌రీక్షల‌కు హాజ‌ర‌య్యారు. అంటే 93.47 శాతం మంది ప‌రీక్షలు రాశారు. ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ కల్పించి వీటి ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు.

ఈ ఏడాది ఇంజినీరింగ్ విభాగంలో 2,74,213 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,58,374 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,95092 మంది ఉత్తీరణ సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో 88,638 మంది దరఖాస్తు చేసుకోగా 80,766 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 70,352 మంది ఉత్తీర్ణత సాధించారు.

AP EAMCET Rank 2024: మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి?

Step 1 : అభ్యర్థులు ముందుగా ఈ వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/ లింక్ పై క్లిక్ చేయండి.

Step 2 : అనంతరం హోంపేజీలో ఏపీ ఈఏపీసెట్ 2024 పై క్లిక్ చేయండి.

Step 3 : హోంపేజీలో రిజల్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Step 4 : విద్యార్థి రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి ఫలితాలు పొందవచ్చు.

Whats_app_banner