AP Govt Employees DA : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - డీఏల విడుదలకు ఉత్తర్వులు జారీ-ap government approves release of two das to employees ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt Employees Da : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - డీఏల విడుదలకు ఉత్తర్వులు జారీ

AP Govt Employees DA : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - డీఏల విడుదలకు ఉత్తర్వులు జారీ

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 15, 2024 10:37 PM IST

AP Govt Employees DA : ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలను విడుదల చేసేందుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ (CMO AP)

AP Govt Employees DA : ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం(AP Govt). ఉద్యోగులకు రెండు డీఏలను(DA) విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది. శుక్రవారం రాత్రికే ఉత్తర్వులను విడుదల చేసింది. ఏప్రిల్‌ జీతంతో కూడిన ఒక డీఏ, జూలై నెల జీతంతో కూడిన మరొక డీఏ అందజేయనుంది. శనివారం నుంచి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కోడ్(Election Code 2024) వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం ఆమోదముద్ర వేయటంతో పాటు ఉత్తర్వులు ఇచ్చింది.

కేసుల ఉపసంహరణ….

మరోవైపు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మె సమయంలో మున్సిపల్ కార్మికుల పై నమోదైన పోలీసు కేసులను ఉపసంహరిస్తూ హోంశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. 2023 డిసెంబరు 26 నుంచి 2024 జనవరి 11 తేదీ వరకూ నిర్వహించిన సమ్మె కాలంలో మున్సిపల్ అధికారుల ఫిర్యాదుల్ని వెనక్కు తీసుకుంటున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి… డీజీపీకి లేఖ రాశారు. ఏలూరు, విశాఖ, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, కడపలలో నమోదైన కేసులను ఉపసంహరిస్తున్నట్టు హోంశాఖ కూడా ప్రకటన విడుదల చేసింది.

త్వరలో రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు, వారి అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయాన్ని పర్యవేక్షించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అన్ని బ్యాంకుల ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ఈ అంశంపై బ్యాంకులు ఐటి డిపార్ట్మెంట్కు అందజేసిన సమాచారం యొక్క స్థితిగతులను, ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు అంద చేయాల్సిన సమాచారంపై చర్చించారు, ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టం అమలుకై బ్యాంకులు చేపట్టిన చర్యలపై ఆరా తీశారు.

Whats_app_banner