PM Schedule In AP: ఏపీలో ప్రధాని పర్యటన ఉన్నట్టా లేనట్టా…! బీజేపీ నేతల్లోనే అనుమానం… ఖరారైన షెడ్యూల్…
PM Schedule In AP: ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాని పర్యటనపై సమాచారం లేకపోవడంపై బీజేపీలో ఓ వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రధాని విజయవాడ రానున్నారు.
PM Schedule In AP: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటనపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి . ఎన్నికల పొత్తులు కుదిరిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మూడు పార్టీలుఒకే వేదికపై ప్రజల ముందుక పదేళ్ల తర్వాత బీజేపీ-టీడీపీ-జనసేనలు ఒకే వేదికపై ప్రజల ముందుకు రానున్నట్లు కూటమి నేతలు ప్రకటించారు. ప్రధాని పర్యటన షెడ్యూల్ వెల్లడి కాకపోవడంతో ఆయన రాకపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
చిలకలూరిపేట నియోజక వర్గంలోని బొప్పూడి వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పదేళ్ల తర్వాత ప్రధాని మోదీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి ఒకే వేదికపై ప్రజల ముందుకు రానున్నారు. 2014లో ఎన్నికల ప్రచార సమయంలో ముగ్గురు నేతలు కలిసి ప్రజల ముందుకు వచ్చారు. నాటి ఎన్నికల్లో ఈ కూటమి విజయం సాధించింది.
2014 ఎన్నికల్లో గెలిచిన మోదీ ప్రధాని పీఠం ఎక్కారు. ఏపీలో విభజన తర్వాత చంద్రబాబు Chandrababu నాయుడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చింది. దాదాపు ఆరేళ్ల తర్వాత టీడీపీ తిరిగి బీజేపీతో జట్టు కట్టింది. జనసేన సైతం గత ఎన్నికల్లో బీజేపీని వీడి కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది. దాదాపు పదేళ్ల తర్వాత మూడు పార్టీలు తిరిగి ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయి.
ఎన్నికల పొత్తులు కుదిరిన నేపథ్యంలో ప్రధాని మోదీతో ఏపీలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా రానున్నట్టు ప్రకటించారు.
ప్రధాని రాక సందర్భంగా బొప్పూడిలో నిర్వహించే సభ కోసం టీడీపీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సభ నిర్వహణ కోసం బీజేపీ-జనసేన-టీడీపీలతో సమన్వయ కమిటీలను కూడా ప్రకటించారు. బోప్పూడిలో సమావేశం నిర్వహించే ప్రాంగణంలో ఏర్పాట్లను టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వయంగా పరిశీలిస్తున్నారు.
సభ నిర్వహణ కోసం వివిధ కమిటీలను ఏర్పాటు చేసి వాటితో సమన్వయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. లక్షలాదిగా ప్రజలను బహిరంగ సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పొత్తు కుదిరిన తరువాత నిర్వహిస్తున్న మొదటి సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మూడు పార్టీలు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రధాని PM షెడ్యూల్ ఇలా…..
ప్రధాని మోదీnarendra modi 15వ తేదీ సాయంత్రం 4.50నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. కేరళాలోని కొచ్చిన్ నుంచి భారత వైమానిక దశం విమానంలో హైదరాబాద్ వస్తారు.
బేగంపేట begumpet విమనాశ్రయం నుంచి రోడ్ షో ద్వారా మల్కాజ్‌గిరి వరకు ప్రయాణిస్తారు. సాయంత్రం 5.15 నుంచి 6.15వరకు గంటపాటు ప్రధాని రోడ్ షో ఉంటుంది. సాయంత్రం 6.20కు రోడ్ షో ముగిస్తారు. అనంతరం రాజ్‌భవన్ చేరుకుంటారు. రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేస్తారు.
16వ తేదీ ఉదయం రాజ్ భవన్ Rajbhavan నుంచి బయల్దేరి బేగంపేట విమానాశ్రయం నుంచి మిగ్ హెలికాఫ్టర్‌లో నాగర్ కర్నలు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు నాగర్ కర్నూలు పర్యటన ముగించుకుని రెండు గంటలకు కర్ణాటకలో గుల్బర్గా చేరుకుంటారు. తిరిగి 18వ తేదీన జగిత్యాలలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు.
బీజేపీ నేతల్లో అయోమయం…
ప్రధాని మోదీ పర్యటనపై ఏపీ బీజేపీ AP BJP నేతలకు కూడా మొదట స్పష్టత లేదు. బీజేపీ నేతల సమాచారం ప్రకారం మోదీ పర్యటనపై ఇంత గోప్యత ఉండదని చెబుతున్నారు. తెలంగాణలో పర్యటనల షెడ్యూల్ నాలుగైదు రోజుల ముందే వచ్చేసిందని, ఏపీలో మాత్రం స్పష్టత రాలేదని చెబుతున్నారు. 18వ తేదీ పర్యటన వివరాలు కూడా అందుబాటులో ఉన్నాయని 17వ తేదీ షెడ్యూల్ విడుదల కాకపోవడంపై సందేహం వ్యక్తం చేశారు.
మరోవైపు ఏపీ పోలీస్ నిఘా వర్గాలకు ప్రధాని పర్యటనపై ముందస్తు సమాచారం అందినట్టు తెలుస్తోంది. ఎన్‌ఎస్‌జి భద్రత ఉండే ప్రధాని పర్యటనకు అవసరమైన సన్నహాలు ఏపీలో మొదలు కాకపోవడంపై ఇంటెలిజెన్స్ వర్గాల్లో కూడా సందేహం ఉంది. శుక్రవారం సాయంత్రానికి పర్యటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు తెలిపాయి.
ఏపీలో ప్రధాని పర్యటన ఇలా….
మార్చి 17వ తేదీ మధ్యాహ్నం 1.50కు ఎయిర్ ఫోర్స్ విమానంలో ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి సాయంత్రం 4.10కు విజయవాడ చేరుకుంటారు. 4.15కు అక్కడి నుంచి మిగ్ -17 హెలికాఫ్టర్‌లో పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ చేరుకుంటారు. 4.55కు పల్నాడు హెలిపాడ్ చేరుకుంటారు.
ఐదు గంటలకు బొప్పూడి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం ఐదు నుంచి ఆరుగంటల వరకు ఎన్డీఏ ర్యాలీ సభలో పాల్గొంటారు. సాయంత్రం 6.15కు పల్నాడు హెలిపాడ్ నుంచి విజయవాడ ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు. రాత్రి ఏడు గంటలకు విజయవాడ నుంచి భారతీయ వాయుసేన విమానంలో హైదరాబాద్ బయల్దేరి వెళ్తారు. 18వ తేదీన జగిత్యాలలో ప్రదాని కార్యక్రమాలు ఉన్నాయి.
సంబంధిత కథనం