AP Govt On Group 1 Mains : గ్రూప్-1 మెయిన్స్ రద్దుపై అప్పీల్ కు వెళ్తాం, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం-amaravati news in telugu ap govt decided to appeal high court verdict on 2018 group 1 mains cancelled ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt On Group 1 Mains : గ్రూప్-1 మెయిన్స్ రద్దుపై అప్పీల్ కు వెళ్తాం, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

AP Govt On Group 1 Mains : గ్రూప్-1 మెయిన్స్ రద్దుపై అప్పీల్ కు వెళ్తాం, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

AP Govt On Group 1 Mains : 2018 గ్రూప్-1 మెయిన్స్ రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై అప్పీల్ కు వెళ్తామని, అభ్యర్థులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం తెలిపింది.

గ్రూప్-1 మెయిన్స్ రద్దుపై అప్పీల్

AP Govt On Group 1 Mains : 2018 గ్రూప్-1 మెయిన్స్ రద్దు(2008 Group 1 Mains Cancelled) చేస్తూ ఏపీ హైకోర్టు(AP High Court) సంచలన తీర్పు ఇచ్చింది. ఆన్సర్స్ పేపర్లను పలుమార్లు కరెక్షన్ చేశారని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై హైకోర్టు ఇవాళ తుదితీర్పు వెలువరించింది. అయితే హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం(AP Govt on Group 1 Mains) స్పందించింది. అభ్యర్థులు ఆందోళన చెందవద్దని సూచించింది. హైకోర్టు తీర్పుపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించింది. ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడేందుకు హైకోర్టు తీర్పుపై అప్పీల్ చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

గ్రూప్ మెయిన్స్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు

2018 గ్రూప్-1 పరీక్ష(APPSC Group 1 Mains) పేపర్ల మూల్యాంకనంపై ఏపీ హైకోర్టులో విచారణ చేసింది. ఇరువైపులా వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం బుధవారం సంచలన తీర్పునిచ్చింది. రెండోసారి, మూడోసారి మూల్యాంకనం చేయటం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. 2018 గ్రూప్-1 మెయిన్స్(AP Group 1 Mains) పరీక్ష రద్దు చేస్తూ ఆదేశాలను జారీ చేసింది. 6 నెలల్లోగా పరీక్ష నిర్వహించాలని ఏపీపీఎస్సీకి(APPSC) కోర్టు ఆదేశాలు ఇచ్చింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. అయితే జవాబు పత్రాలను మాన్యువల్ (చేతితో దిద్దడం) విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మొదటిసారి దిద్దిన ఫలితాలను తొక్కిపెట్టి… రెండోసారి దిద్దించి నచ్చిన వారిని ఎంపిక చేసుకొని ఏపీపీఎస్సీ ఫలితాలు ప్రకటించిందని అభ్యర్థులు ఆరోపించారు. ఇదే విషయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్నుంచి ఈ కేసుపై విచారణ జరుగుతుంది. ఇరువైపులా వాదన విన్న హైకోర్టు.. ఇవాళ తీర్పును ప్రకటించింది. మెయిన్స్ ఆన్సర్స్ పత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని ఎంపికైన అభ్యర్థుల జాబితాను హైకోర్టు రద్దు చేసింది.

సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్

2018లో 167 పోస్టుల భర్తీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేశారు. గ్రూప్-1 మెయిన్స్ ఆన్సర్ పత్రాలు డిజిటల్ ఎవాల్యూయేషన్ తర్వాత రెండుసార్లు మూల్యాంకన చేశారంటూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే తాము నిబంధనల మేరకే మూల్యాంకనం చేశామని ఏపీపీఎస్సీ వాదనలు వినిపించింది. ఈ పిటిషన్లపై వాదనలు విన్న హైకోర్టు గ్రూప్-1 మెయిన్స్‌ రద్దు చేసి, మరో 6 నెలల్లో మెయిన్స్ నిర్వహించాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వారు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం అంటోంది. ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడేందుకు సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని తెలిపింది.

సంబంధిత కథనం