AP 1st Inter Supplementary Results: కాసేపట్లో ఏపీ ఫస్టియర్ ఇంటర్ ఫలితాలు విడుదల, ఇప్పటికే విడుదలైన సెకండియర్ ఫలితాలు
AP 1st Inter Supplementary Results: ఏపీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను మరికాసేపట్లో ఇంటర్ బోర్డు విడుదల చేయనుంది.
AP 1st Inter Supplementary Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మొదటి సంవత్సరం ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. సప్లిమెంటరీ పరీక్షలు మే 24 శుక్రవారం నుంచి జూన్ 3వరకు జరిగాయి. ఇప్పటికే ఇంటర్ సెకండియర అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. మొదటి సంవత్సరం ఫలితాలను ఇంటర్ బోర్డు ప్రకటించనుంది. ఫలితాలను ఏపీ ఇంటర్ బోర్డు అధికారిక సైట్‌లో విడుదల చేస్తారు.
https://bie.ap.gov.in/Index.do ఈ లింకును అనుసరించండి.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రోజుకు రెండు విడతల్లో పరీక్షల్ని నిర్వహించారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, సెకండియర్ పరీక్షల్ని మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదున్నర వరకు నిర్వహించారు.
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 861 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 33 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలు ఉన్నట్టు గుర్తించారు. మరో 37 సున్నితమైన కేంద్రాలను కూడా ఇంటర్ బోర్డు గుర్తించింది.
ఫలితాల కోసం లింకును అనుసరించండి…
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,03,459మంది హాజరయ్యారు. మొదటి సంవత్సరం విద్యార్ధుల్లో 1,77,012 బాలురు, 1,69,381మంది బాలికలతో మొత్తం 3,46,393మంది పరీక్షలు హాజరయ్యారు. వీరితో పాటు ఫస్టియర్‌లో మరో 19,479మంది ఒకేషనల్ విద్యార్థులు కూడా పరీక్షలకు హాజరవుతారు. ఇంటర్ ఫస్టియర్‌లో 3,65,872మంది పరీక్షలు రాస్తున్నారు.
ఇంటర్ సెకండియర్‌లో 67,129మంది బాలురు, 54416మంది బాలికలతో 1,21,545మంది పరీక్షలు రాశారు. ఒకేషనల్ కోర్సుల్లో 9499 బాలురు, 6543 మంది బాలికలు పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో మొత్తం 1,37,587మంది పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లలో కలిపి 5,03,459మంది ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. సెకండియర్ ఫలితాలు ఇప్పటికే వచ్చేశారు.
అందుబాటులో హెల్ప్‌లైన్…
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ నేపథ్యంలో తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గ్రీవెన్స్ సెల్ అందుబాటులో ఉండనుంది. విద్యార్ధుల ఇబ్బందులపై 08645-277702 ల్యాండ్ లైన్ నంబర్, టోల్ ఫ్రీ నంబర్ 1800-4251531 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.
ఫలితాలు తెలుసుకోండి ఇలా…
- Step 1: ఏపీ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://bie.ap.gov.in/Index.do పై క్లిక్ చేయండి.
- Step 2: హోమ్ పేజీలో ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ 2024 లింక్ పై క్లిక్ చేయండి.
- Step 3: ఫస్టియర్ జనరల్ లేదా వొకేషనల్ ఫలితాల లింక్ పై క్లిక్ చేయండి.
- Step 4: విద్యార్థి హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
- Step 5: మీ రిజల్ట్ స్క్రీన్ పై కనిపిస్తాయి.
- Step 6: భవిష్యత్ రిఫరెన్స్ కోసం ఫలితాలు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.
డిజిలాకర్‌లో ఫలితాలు…
సప్లిమెంటరీ ఫలితాలను డిజిలాకర్‌లో అందుబాటులో ఉంచుతామని బోర్డు అధికారులు తెలిపారు. ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు జూన్ 30లోపు సంబంధిత కాలేజీల్లో పొందవచ్చని పేర్కొంది. ఈ ఏడాది ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 1,27,190 మంది విద్యార్థులు హాజరు కాగా... 74,868 మంది ఉత్తీర్ణత సాధించారు. పాస్ పర్సెంజెట్ 59 శాతంగా ఉంది.
సంబంధిత కథనం